News


1490 డాలర్లపైన పసిడి

Friday 18th October 2019
Markets_main1571377656.png-28976

చైనా ఆర్థిక గణాంకాలు నిరాశపరడచంతో పాటు బ్రెగ్జిట్‌ అంశం నేపథ్యంలో పసిడి ధర శుక్రవారం 1490డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3 డాలర్ల స్వల్ప నష్టంతో 1,495 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈయూ నుంచి బ్రిటన్‌ విడిపోవడానికి బ్రెగ్జిట్‌ నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ గురువారం ప్రకటనతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అయితే  నేడు బ్రెగ్జిట్‌ నూతన ఒప్పందానికి బ్రిటన్‌ పార్లమెంట్‌ మద్దతునిస్తుందా లేదా అనే అంశంపై పసిడి ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. బ్రెక్సిట్ ఒప్పందం పసిడిపై ఊహించినంతగా ప్రతికూల ప్రభావం చూపలేదు. పార్లమెంటులో ఆమోదించబడకపోవచ్చు అనే ఆందోళనలు కొనసాగుతుండం పసిడి కలిసొచ్చే అంశంగా మారింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధ ప్రభావంతో మూడవ త్రైమాసికంలో చైనా యొక్క ఆర్ధిక వృద్ధి  మందగించినట్లు గణాంకాలు వెలువడ్డాయి. మూడో త్రైమాసికంలో చైనా ఆర్థిక వృ‍ద్ధి వార్షిక ప్రాతిపాదికన 6శాతం కంటే తక్కువగా నమోదైంది. ఇది దాదాపు మూడు దశాబ్దాలలో అత్యంత బలహీనమైన వృద్ధి. బ్రెగ్జిట్, ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో పసిడి అప్‌ట్రెండ్‌ కొనసాగే అవకాశం ఉందని బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. స్వల్ప కాలికంలో పసిడి ధర 1,475 - 1503డాలర్ల రేంజ్‌లో ట్రేడయ్యే అవకాశం ఉందని వారంటున్నారు. నిన్నరాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి ధర 4.30డాలర్ల పెరిగి 1498 వద్ద స్థిరపడింది. 
దేశీయ మార్కెట్లోనూ స్వల‍్ప తగ్గింపు:- 
దేశీయ మార్కెట్లోనూ పసిడి ధర స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.39.00లు నష్టంతో రూ.38425.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ లాభాల ప్రారంభం పసిడి ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నిన్న రాత్రి దేశీయంగా పసిడి ధర రూ.33లు స్వల్ప నష్టంతో రూ.38196 వద్ద ముగిసింది. 



You may be interested

రూ. 50 స్థాయిని దాటిన యస్‌ బ్యాంక్‌

Friday 18th October 2019

వివిధ మార్గాల ద్వారా నిధులను సేకరించేందుకు మేనేజ్‌మెంట్‌ ప్రయత్నిస్తోందని యస్‌ బ్యాంక్‌ ప్రకటించడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ శుక్రవారం సెషన్‌లో 5.80 శాతం లాభపడి రూ. 50.15 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో 15 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 47.40 వద్ద ముగిసిన ఈ బ్యాంక్‌ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 46.60 వద్ద ప్రారంభమై, రూ. 51.80 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.  యస్‌ బ్యాంక్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌క్యాప్‌ @ 9 లక్షల కోట్లు!

Friday 18th October 2019

-ఆల్‌టైం గరిష్ఠానికి కంపెనీ షేరు దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,  శుక్రవారం సెషన్‌లో రూ. 9 లక్షల కోట్లు మార్కెట్‌ క్యాప్‌ ఉన్న మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. కంపెనీ సెప్టెంబర్‌ ఫలితాలలో బలమైన ఫలితాలను ప్రకటిస్తుందనే అంచనాల నేపథ్యంలో రిలయన్స్‌ షేరు విలువ 2 శాతానికి పైగా ర్యాలీ చేసీ రూ. 1427.90 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ కంపెనీ

Most from this category