News


1400డాలర్లు పైకి పసిడి ధర

Friday 21st June 2019
Markets_main1561096645.png-26461

ఐదేళ్ల సుధీర్ఘకాలం తర్వాత పసిడి ధర 1400డాలర్ల స్థాయిని అందుకుంది. క్రితం ట్రేడింగ్‌లో 50డాలర్లు ర్యాలీ చేసిన 5ఏళ్ల గరిష్టాన్ని అందుకున్న పసిడి ధర, నేటి ట్రేడింగ్‌లో మరో 18డాలర్లు లాభపడింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రికత్తలు, కీలక వడ్డరేట్లపై పలు దేశాల కేంద్ర బ్యాంకులు మెతక వైఖరి, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత తదితర ఇందుకు కారణమయ్యాయి. అమెరికా తెరలేపిన వాణిజ్య యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థివృద్ధి మందగించింది. ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరించేందుకు పలు కేంద్రం బ్యాంకులు కీలక వడ్డీరేట్లపై కోత సిద్ధమయ్యాయి. ఈసారికి అమెరికా వడ్డీరేట్లను యధాతథంగా ఉంచినప్పటికీ, వచ్చే నెలలో పెంచే అవకాశం ఉండవచ్చని ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ స్పష్టం చేశారు. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ) సైతం వడ్డీరేట్ల తగ్గింపునకే మొగ్గు చూపింది. సెంట్రల్‌ బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయం పసిడిపై ప్రభావాన్ని చూపే డాలర్‌, ట్రెజరీ ఈల్డ్స్‌పై తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తుంది. నేడు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 0.20శాతం క్షీణించగా, పదేళ్ల ట్రెజరీ ఈల్డ్‌ 2శాతం నష్టపోయి రెండున్నరేళ్ల కనిష్టానికి చేరకుంది. పశ్చిమాసియాలో అమెరికా - ఇరాన్‌ల మధ్య రాజుకున్న యుద్ధ వాతవరణం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుంది. ఫలితంగా వారు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి పసిడి ఫ్యూచర్ల వైపు మళ్లిస్తున్నారు. ఇక సాంకేతికంగా పసిడి ధర 1350డాలర్లను అధిగమించడం పసిడి కలిసొచ్చింది. ఉదయం గం.11:00లకు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 10డాలర్ల లాభంతో 1,406 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగానూ అదే ధోరణి:-
నేడు ఎంసీక్స్‌ మార్కెట్లో పసిడి ధర నిన్నటి ముగింపు(రూ.34026)తో పోలిస్తే రూ.286ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ పసిడి ధర 1400డాలర్ల స్థాయిని అందుకోవడం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 22పైసలు క్షీణించడం కలిసొస్తున్నాయి. నిన్నటి రోజున పసిడి ధర రూ.957లు పెరిగి రూ. 34026ల వద్ద ముగిసింది. 



You may be interested

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

Friday 21st June 2019

ఎలక్ట్రిక్‌ వాహనాల పన్ను 5 శాతానికి తగ్గింపు? జీఎస్టీ ఎగవేతలను నిరోధించే పలు ప్రతిపాదనలు నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో తొలి భేటీ న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాహంలో భాగంగా జీఎస్టీ రేటు తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్‌ శుక్రవారం జరిగే సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం 12 శాతం రేటు ఉండగా, దీన్ని 5 శాతానికి తగ్గించాలన్నది ప్రతిపాదన. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై ప్రస్తుతం 28 శాతం పన్ను రేటు అమల్లో ఉంది.

29.59శాతం నష్టపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌

Friday 21st June 2019

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు శుక్రవారం(జూన్‌ 21) 29.59శాతం నష్టపోయి రూ. 43.60 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో షార్ట్‌ కవరింగ్‌ల దన్నుతో ఇంట్రాడేలో ఏకం‍గా 150 శాతం లాభపడి రూ.62.85 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. స్టేట్‌ బ్యాం‍క్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌పై వేసిన దివాలా పిటీషన్‌ను గురువారం ఎన్‌సీఎల్‌టీ స్వికరించడంతో కంపెనీ షేరు విలువ 10 శాతం మేర పతనమై రూ.56.60 వద్ద శుక్రవారం ప్రారంభమైంది. ‘సంస్థపై చాలా అప్పులున్నాయి.

Most from this category