News


భగ్గుమన్న బంగారం

Monday 5th August 2019
Markets_main1564979817.png-27533

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి భారీ పతనంతో సోమవారం బంగారం ధరలు భగ్గమన్నాయి. నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల  బంగారం ధర రూ.600 ఎగసి రూ.36,990ల రికార్డుస్థాయిని అందుకుంది. ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలతో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 3నెలల కనిష్టానికి పతనమైంది. బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే రూపాయి  బలహీనపడటంతో బంగారం ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీ సైతం దేశీయ బంగారాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా నేడుఎంసీఎక్స్‌లో ట్రేడింగ్‌ ప్రారంభంలో బంగారం ధర రూ.600 పెరిగి రూ.36,990ల గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:00లకు రూ.588.00లు పెరుగుదలతో రూ.36859.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ప్రపంచ మార్కెట్లో 11డాలర్ల ర్యాలీ 
ప్రపంచమార్కెట్లోని పసిడి ధర పరుగులు పెడుతోంది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 11డాలర్లు లాభపడింది. అమెరికా - చైనాల మధ్య పెరిగిన వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, డాలర్‌ బలహీనపడటం, ఆసియా ఈక్విటీ మార్కెట్‌ పతనం పసడి ర్యాలీకి మద్దతినిస్తున్నాయి. చైనాతో తాను అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సమర్ధించుకున్నారు. ట్రేడ్‌వార్‌పై స్పందించిన చైనా విదేశాంగ మంత్రి ఆర్థిక వాణజ్యపరమైన ఘర్షణలకు సుంకాలు పరిష్కారం చూపవని వాఖ్యానించారు. అమెరికాలోకి దిగుమతి అవుతున్న 300 మిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై 10శాతం పన్ను విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రేడ్‌వార్‌తో కలిగే నష్టాల నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఫెడ్‌రిజర్వ్‌ మళ్లీ వడ్డీరేట్ల కోత తగ్గింపుపై మొగ్గుచూపాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వచ్చే పాలసీ సమావేశాల్లో వడ్డీరేట్ల కోత విధించవచ్చనే అంచనాలతో డాలర్‌ బలహీనపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ వారం వారం రోజుల కనిష్టానికి పతనమైంది. ఈ ప్రతికూల అంశాల నేపథ్యంలో నేడు ఆసియా ఈక్విటీ మార్కెట్లు 6నెలల కనిష్టానికి పతనమయ్యాయి. ఫలితంగా నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 11డాలర్లు పెరిగి 1,468.05 డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:45ని.లకు ఔన్స్‌ పసిడి ధర 7.35 డాలర్ల లాభంతో 1,464.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 700 పాయింట్లు క్రాష్‌

Monday 5th August 2019

 నిఫ్టీ బ్యాంక్‌ ఇం‍డెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో ఉదయం 10.23 సమయానికి 705.25 పాయింట్లు నష్టపోయి 27499.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులయిన  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 4.07 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.72 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 2.88 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.29 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. కాగా ప్రవేట్‌ రంగ బ్యాంకులయిన యెస్‌ బ్యాంక్‌ 6.57

డిమాండ్‌ భయాలు..పడిపోయిన చమురు

Monday 5th August 2019

యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 300 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 10 శాతం సుంకాలను విధిస్తానని వ్యాఖ్యానించడంతో డిమాండ్‌ భయాల దృష్ట్యా సోమవారం ట్రేడింగ్‌లో చమురు బలహీనంగా ఉంది.  బ్రెంట్ క్రూడ్‌ 0.8 శాతం తగ్గి బ్యారెల్‌ 61.39 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌  0.4 శాతం తగ్గి బ్యారెల్‌ 55.42 డాలర్లకు పడిపోయాయి. ఇంధనాన్ని అక్రమంగా రవాణా చేస్తుందని, ఇరాన్‌ ఒక ఆయిల్‌ ట్యాంకర్‌ను

Most from this category