News


2వారాల కనిష్టం వద్ద పసిడి

Friday 23rd August 2019
Markets_main1566536152.png-27962

ప్రపంచమార్కెట్లో శుక్రవారం పసిడి ధర 2వారాల కనిష్టస్థాయి దిగువను ట్రేడ్‌ అవుతోంది. బాండ్‌ ఈల్డ్‌ బలపడటంతో పసిడి ధరపై ఒత్తిడి పెరుగుతోంది. ఫెడ్‌రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ నేటిరాత్రి జాక్సన్‌ హోల్‌ సదస్సు ప్రసంగించనున్న నేపథ్యంలో బాండ్‌ ఈల్డ్‌ బలపడుతోంది. ఆసియా ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర నిన్నటి ముగింపు(1,503.85 డాలర్లు)తో పోలిస్తే 5డాలర్లు నష్టపోయి 1,503.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల వెలువడిన జూలై ఫెడ్‌ మినిట్స్‌లో ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ ప్రణాళిక గురించి కొత్తగా ఏమీ చెప్పలేదు. ఇప్పటికే బాండ్లు, పసిడి ధరలు భారీగా ర్యాలీ చేశాయి. ఇంకా చేస్తున్నాయని బులియన్‌ వాలెట్‌ డైరెక్టర్‌ ఆడ్రియన్‌ యాష్‌ తెపిపారు. జూలై ఫెడ్‌ మినిట్స్‌ విడుదల అనంతరం నేడు పావెల్‌ జాక్సన్‌ హోల్‌ సదస్సు ప్రసంగంపై మార్కెట్‌ సర్వత్రా ఆసక్తితో ఎదురుచూస్తుంది. వడ్డీరేట్ల కోతపై ఫెడ్‌ వైఖరి ఎలా ఉందో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇప్పుటికే కొందరు ట్రేడర్లు పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ తీసుకున్నారు. అయితే ప్రపంచ ఆర్థిక వృద్ధిపై కొంత ఆందోళన నెలకొని ఉండటం, వాణిజ్య అస్థిరత, భౌగోళిక ఉద్రిక్తతలు తదితర ప్రతికూలాంశాలు ఇంకా సద్దుమణగలేదు. రానున్న రోజుల్లో ఇవి పసిడి ర్యాలీకి మద్దతినిస్తాయనే ఆడ్రియన్‌ తెలిపారు.
దేశీయంగా రూ.50లు క్షీణత:- 
ఇక దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర రూ.50లు నష్టపోయింది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఎనిమిది నెలల కనిష్టానికి పతనమైనప్పటికీ.., ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.50ల నష్టంతో 38115.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కిత్రం ట్రేడింగ్‌లో రూపాయి 8నెలల కనిష్టానికి పతనమైన నేపథ్యంలో నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికే 10గ్రాముల పసిడి ధర రూ.172 లాభపడి రూ.38165 వద్ద స్థిరపడింది.



You may be interested

నష్టాలకు బ్రేక్‌..60 డాలర్లకు పైన చమురు

Friday 23rd August 2019

చమురు డిమాండ్‌ ఆందోళనల నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి దారులు సరఫరాను కఠినతరం చేయడంతో చమురు ధరలు శుక్రవారం ట్రేడింగ్‌లో పెరిగాయి. దీనితో పాటు ఫెడ్‌ రిజర్వ్‌ మానెటరీ పాలసీపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు వేచి ఉండడం కూడా చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. బ్రెంట్‌ క్రూడ్‌ 10 సెంటులు పెరిగి బారెల్‌ 60.02 డాలర్లకు చేరుకోగా డబ్యూటీఐ క్రూడ్‌ 3 సెంటులు పెరిగి బారెల్‌ 55.38 డాలర్లకు చేరుకుంది.

8 నెలల కనిష్ఠానికి రూపీ

Friday 23rd August 2019

దేశియ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో, గత ఏడాది డిసెంబర్‌ తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి శుక్రవారం చేరుకుంది. రూపీ డాలర్‌ మారకంలో 10 పైసలు బలహీనపడి 71.91 ప్రారంభమవ్వగా, కొద్ది నిముషాల్లోనే 72.05 స్థాయిని తాకింది. ఈక్విటీ మార్కెట్‌ భారీగా పడిపోవడంతో పాటు విదేశి నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగుతుండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 26 పైసలు బలహీనపడి 71.81 వద్ద ముగిసింది. కాగా రూపీ

Most from this category