News


లాభంతో ముగిసిన పసిడి

Saturday 11th January 2020
Markets_main1578722101.png-30856

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు శుక్రవారం లాభంతో ముగిశాయి. అమెరికాలో నిన్నరాత్రి మార్కెట్ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి ధర 5.80డాలర్లు లాభపడి 1,560.10 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా డిసెంబర్‌ పేరోల్‌ వృద్ధి గణాంకాలు అంచనాలకు మించిన నమోదు కాకపోవడంతో బాండ్‌ ధరలు పెరిగాయి. తద్వారా తగ్గిన బాండ్‌ ఈల్డ్‌లు...వడ్డీరేట్ల తగ్గింపునకు దారి తీయవచ్చనే అశావహ అంచనాలు పసిడికి డిమాండ్‌ పెంచినట్లు బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కిందటేడాదిలో స్పాట్‌ బంగారం ధర 18శాతం ర్యాలీ చేయగా, పసిడి ఫ్యూచర్లు 16శాతం పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం స్పాట్‌, ఫ్యూచర్‌ ధరలు అనూహ్యంగా 3శాతం లాభపడ్డాయి. సాధారణంగా పసిడి ధరలు ఈక్విటీలకు వ్యతిరేక దిశలో ట్రేడ్‌ అవుతాయి. అయితే చివరి త్రైమాసికం నుంచి  ఈక్విటీలతో పాటు పసిడి ధరలు ర్యాలీ చేస్తుండటం విశేషం. ఈక్విటీ మార్కెట్లు గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో ముందస్తు రక్షణాత్మక చర్చల్లో భాగంగా ఇన్వెస్టర్లు పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్‌ ఇండెక్స్‌ శుక్రవారం వారం రోజుల గరిష్టస్థాయి 97.303 వద్ద స్థిరపడింది. ఇరాన్‌- అమెరికా ఉద్రిక్తతలతో పసిడి ఫ్యూచర్లు ఈ బుధవారం ట్రేడింగ్‌ సెషన్‌లో ఏడేళ్ల గరిష్టస్థాయి 1,613.30డాలర్లను తాకాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టడం, గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణలతో పసిడి ధర దిగివచ్చింది. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు 0.50శాతం పెరిగాయి. 

దేశీయంగా స్వల్ప లాభం:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరకు అనుగుణంగా దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో స్వల్పంగా పెరిగింది. గతరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రామలు పసిడి ధర రూ.41.00 లాభంతో రూ.39871.00 వద్ద స్థిరపడింది. 



You may be interested

ఇక మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ హవా

Saturday 11th January 2020

2020లో ఈక్విటీ మార్కెట్లు గుడ్‌ విదేశీ ఆందోళనల ప్రభావం స్వల్పకాలికమే వినోద్‌ నాయర్‌ అంచనాలు ఈ కేలండర్‌ ఏడాది(2020)లో ఈక్విటీ మార్కెట్‌ వెలుగులో నిలవనున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, రీసెర్చ్‌ హెడ్‌.. వినోద్‌ నాయర్‌ అంచనా వేస్తున్నారు. ప్రధాన లార్జ్‌ క్యాప్స్‌ ఇప్పటికే భారీగా ర్యాలీ చేయడంతో ఇండెక్సులు దూకుడు చూపినప్పటికీ, ఇక మధ్య, చిన్నతరహా(మిడ్‌, స్మాల్‌ క్యాప్‌) కౌంటర్లకు డిమాండ్‌ కనిపించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇంకా పలు అంశాలపై నాయర్‌ అంచనాలు ఎలా ఉన్నాయంటే...  రిస్కులు తగ్గాయ్‌.. కొత్త

అసలు వాళ్లు ఇన్ఫీ ఉద్యోగులేనా..నీలకేని

Saturday 11th January 2020

విజిల్‌బ్లోయర్స్‌పై నందన్‌ అనుమానం గతేడాది ఇన్ఫోసిస్‌ టాప్‌మేనేజ్‌మెంట్‌పై కొందరు విజిల్‌ బ్లోయర్లు చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవని కంపెనీ ఏర్పాటు చేసిన ఆడిట్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. కంపెనీ టాప్‌మేనేజ్‌మెంట్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈనేపథ్యంలో కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ చైర్మన్‌ నందన్‌ నీలకేని సదరు విజిల్‌ బ్లోయర్స్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు వాళ్లు నిజంగా తమ కంపెనీ ఉద్యోగులేనా? ఈ విషయం చెక్‌ చేయాలని అభిప్రాయపడ్డారు. తమ ఉద్యోగులు,

Most from this category