News


పసిడీకి ‘‘వైరస్‌’’!

Saturday 14th March 2020
Markets_main1584157710.png-32471

  • 70 డాలర్లకు పైగా పతనం
  • 2020 కనిష్ట స్థాయిలకు పయనం

న్యూయార్క్‌: పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌- నైమెక్స్‌లో భారీ పతనాన్ని చూసింది. ఈ వార్తరాసే 11 గంటల సమయంలో పసిడి ధర 71 డాలర్ల నష్టంతో (4.5 శాతం) 1,520 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,504 డాలర్ల స్థాయికీ పడిపోయింది. 2020లో ఈ స్థాయికి పసిడి ధరలు పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడచిన 52 వారాల్లో 1,266 డాలర్ల కనిష్టాన్ని చూసిన బంగారం ధర, వాణిజ్య యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలూ, తాజాగా కోవిడ్‌-19 భయాల నేపథ్యంలో మూడు వారాల క్రితం 1,704.30 గరిష్ట స్థాయిలనూ చూసింది. 

కారణమేమిటి..? 
ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత సాధనాల నుంచి వేగంగా మార్చేస్తున్నారు. భారీగా పెరిగిన బంగారం ధర నేపథ్యంలో... వారి ఇన్వెస్ట్‌మెంట్లను శుక్రవారం ఈక్విటీల్లోకి మళ్లించినట్లు సంకేతాలు అందుతున్నాయి. దీనికితోడు భారీగా పెరిగిన బంగారం ధర నుంచి లాభాల స్వీకరణా చోటుచేసుకుంటోందని నిపుణుల అంచనా. పసిడి కొనుగోళ్లకు ఇది తగిన అవకాశమనీ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

దేశీయంగానూ భారీ తగ్గుదల...
దేశీయంగానూ పసిడి ధర దిగివస్తోంది. ఈ వార్త రాసే సమయానికి దేశీయ ఫ్యూచర్స్‌ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర రూ.1,885 తగ్గి, రూ.40,321 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం పలు దేశీయ స్పాట్‌ మార్కెట్లలో పసిడి ధర రూ.1,500 వరకూ పడింది. నిజానికి అంతర్జాతీయంగా ధరల భారీ పతనం నేపథ్యంలో దేశీయంగానూ ఇదే ధోరణి కనబడాలి. అయితే డాలర్‌ మారకంలో రూపాయి మారకం విలువ బలహీనత వల్ల ధర మరింతగా పడడం లేదు. 
 



You may be interested

రూపాయికి ఆర్‌బీఐ బూస్ట్‌

Saturday 14th March 2020

48 పైసలు పురోగమనం 73.80 వద్ద ముగింపు ముంబై: ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో భయాందోళన పడాల్సింది ఏదీ లేదని, ఇందుకు తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నామనీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇచ్చిన హామీ శుక్రవారం రూపాయికి వరమయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 48 పైసలు బలపడి 73.80 వద్ద ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... రూపాయి గురువారం ముగింపు

యస్‌ బ్యాంక్‌ ప్రణాళికకు కేంద్రం ఓకే ..

Saturday 14th March 2020

(అప్‌డేటెడ్‌...) త్వరలో మారటోరియం ఎత్తివేత చెరి రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ రూ. 600 కోట్లు దాకా యాక్సిస్‌ బ్యాంక్,  రూ. 500 కోట్లు కోటక్‌ మహీంద్రా పెట్టుబడి న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రణాళికను నోటిఫై చేసిన 3 రోజుల్లోగా బ్యాంకుపై మారటోరియంపరమైన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు, 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక

Most from this category