News


స్థిరంగా పసిడి

Monday 11th November 2019
Markets_main1573446013.png-29497

గత వారాంతపు రోజున 3నెలల కనిష్టానికి పతనమైన పసిడి ఫ్యూచర్‌ ధర సోమవారం స్థిరంగా కదలాడుతుంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరశాతం లాభంతో 1463.50డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా ‘‘మొదటి దశ ఒప్పందం’’ సఫలం దిశగా సాగుతుందనే ఆశావహన అంచనాలతో పాటు,  డాలర్ ఇండెక్స్‌ సైతం 3వారాల గరిష్టానికి చేరుకోవడంతో పసిడి ధర 3నెలల కనిష్టస్థాయి 1,459 డాలర్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో పసిడిపై మరింత ఒత్తిడి పెరగచ్చు. సాంకేతికంగా చూస్తే తక్షణ మద్దతు 1,457 డాలర్ల వద్ద, తదుపరి 1,450 డాలర్ల దగ్గర ఉండవచ్చని అంచనా అయితే, అమెరికా-చైనాల మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న వార్తలతో మార్కెట్లు ర్యాలీ చేసినప్పటికీ.. దీనిపై ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో అంత ధీమా కనిపించడం లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. చైనా ఒత్తిళ్లకు లొంగి సుంకాల విషయంలో వెనక్కి తగ్గేందుకు అమెరికా ప్రభుత్వ వర్గాలు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ పసిడి రేటు పెరిగిన పక్షంలో తక్షణ నిరోధం 1,473.90 డాలర్లు, అటు పైన 1,480 డాలర్ల వద్ద రెండో నిరోధ స్థాయి ఉండగలదని అంచనా. 1,500 డాలర్ల వద్ద గట్టి నిరోధం ఎదురుకావచ్చు. 
దేశీయంగానూ రూ.38వేల దిగువనే:-
దేశీయ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి రూ.29లు స్వల్పంగా లాభపడి రూ.37716.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఫ్లాట్‌గా, ఈక్విటీ మార్కెట్లు పరిమిత శ్రేణిలో  ప్రారంభం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా కదలడం తదితర కారణాలు దేశీయంగా పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతున్నాయి. గతవారం చివరి రోజున శుక్రవారం దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.112.00లు లాభపడి రూ.37687.00 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. 



You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు ఫలితాల బూస్ట్‌...5 శాతం అప్‌

Monday 11th November 2019

5శాతం లాభపడి షేరు మెరుగైన రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 5.50శాతం లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.94.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.లాభదాయకమైన క్యూ2 ఫలితాలను ప్రకటించడం‍తో ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఈ షేరు కొనుగోలుకు మొగ్గుచూపారు. ఫలితంగా ఒక దశలో 5.50శాతం లాభపడి రూ.98.90 వద్ద గరిష్టస్థాయిని తాకింది. ఉదయం గం.10.00లకు షేరు గత ముగింపు

11840పాయింట్ల వద్ద బలమైన మద్దతు!

Monday 11th November 2019

ఏంజల్‌ బ్రోకింగ్‌ అనలిస్టు సమిత్‌ చవాన్‌ గతవారం నిఫ్టీ సుమారు 200 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. వారాంతానికి నెగిటివ్‌గా క్లోజయి వారం మొత్తం ఆర్జించిన లాభాలు దాదాపు వదిలిపెట్టింది. సెన్సెక్స్‌ కొత్త రికార్డులను చూస్తుండగా, నిఫ్టీ మాత్రం వెనకముందు ఆడుతోంది. గతవారం నిఫ్టీ గత గరిష్ఠం దాటేందుకు పలు యత్నాలు చేసింది. కానీ సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11843 పాయింట్ల వద్ద చాలా బలమైన మద్దతు ఉంది. ఇంట్రాడేలో

Most from this category