News


1500డాలర్ల దిగువకు పసిడి

Saturday 14th September 2019
Markets_main1568447785.png-28377

అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ బలపడటంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 1500డాలర్ల దిగువన ముగిసింది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 11.40డాలర్లు క్షీణించి 1,496.00డాలర్ల వద్ద స్థిరపడింది. వచ్చేవారంలో మంగళ, బుధవారాల్లో ఫెడ్‌రిజర్వ్‌ ఓపెన్‌ పాలసీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ వైఖరి పసిడి ఫ్యూచర్ల తదుపరి గమనానికి కీలకం కానుంది. ఒకవేళ వడ్డీరేట్లను తగ్గిస్తే పసిడికి కలిసొస్తుంది. అయితే కామెక్స్‌ పోజిషన్లు అధికంగా ఉండటం, క్రమంగా పెరుగుతున్న బాండ్‌ ఈల్డ్స్‌, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ పసిడికి ప్రతికూలంగా మారుతున్నాయిని బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెలలో అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇప్పటికే శాంతి పూర్వక వాతావరణ నెలకొనడంతో ఇరుదేశాల మధ్య వేడిక్కిన వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు చల్లబడటం, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఉద్దీపన చర్చల ప్రకటన తదితర కారణాలతో  ఇక వారం మొత్తంగా పసిడి ధర 19.50డాలర్ల( 1.1శాతం) నష్టాన్ని చవిచూసింది. 
దేశీయంగా రూ.226.00 నష్టం:- 

అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ పసిడి ధర నష్టాల్లో ముగిసింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.226.00 పతనమైన రూ.37524.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా 7రోజూ పెరగడంతో ఈ వారంలో ఎంసీఎక్స్‌లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.1029 నష్టపోయింది. వచ్చే వారంలో పసిడి ధర రూ.37,319-38,451 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తుంది. 



You may be interested

బ్యాంకింగ్‌ షేర్లలో ఎఫ్‌పీఐల అమ్మకాలు

Saturday 14th September 2019

కేంద్ర ఆర్థిక మంత్రి, ఈ ఏడాది బడ్జెట్‌లో కంపెనీల షేర్ల బై బ్యాక్‌పై పన్నును, సూపర్‌రిచ్‌లపై అదనపు ట్యాక్స్‌ను విధించడంతో అగష్టు నెలలో బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌  షేర్ల నుంచి ఎఫ్‌పీఐ(విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు) నిధుల ఔట్‌ఫ్లో భారీగా జరిగిందని, ఇది గత ఏడున్నరేళ్లలో అధ్వాన్న పరిస్థితి అని ఎన్‌ఎస్‌డీఎల్‌(నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ) డేటా పేర్కొంది.  అగష్టు 2019లో ఎఫ్‌పీఐలు బ్యాంకింగ్‌ షేర్ల నుంచి 124 కోట్ల డాలర్ల సంపదను ఉపసంహరించుకోగా,

ఫండ్స్‌ ఏం కొన్నాయి...ఏం విక్రయించాయ్‌?

Saturday 14th September 2019

 జులై నెలలో కంటే దేశియ ఈక్విటీ మార్కెట్లు అగష్టులో కొంత సానుకూలంగా కదిలాయి. విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు అగష్టులో కూడా అధికంగా అమ్మకాలకు పాల్పడగా, దేశియ సంస్థాగత ఇన్వెస్టర్లు నికర కొనుగోలు దారులయ్యారు. బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ జూన్‌, జూలై నెలలో భారీగా దిద్దుబాటుకు గురవ్వగా, అగష్టులో మాత్రం కొంత కోలుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు జూన్‌లో 8 శాతం, జులైలో 11 శాతం పతనంకాగా, అగష్టులో

Most from this category