News


మళ్లీ 1500డాలర్ల పైకి పసిడి

Thursday 3rd October 2019
Markets_main1570078305.png-28691

మూడు సెషన్ల తర్వాత పసిడి ఫ్యూచర్ల ధర మళ్లీ 1500 డాలర్ల స్థాయి అందుకుంది. అమెరికాలో నమోదైన బలహీన ఆర్థిక గణాంకాలు ఆ దేశ ఈక్విటీ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. అలాగే అమెరికా తాజాగా యూరప్‌ దేశాల దిగుమతులపై తాజా సుంకాల విధింపుతో వాణిజ్య వివాదాలకు తెరలేపింది. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక సాధనమైన పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా నిన్నరాత్రి అక్కడి మార్కెట్‌లో ఒక దశలో పసిడి ఫ్యూచర్‌ ధర 22డాలర్ల మేర ర్యాలీ చేసి 1,511.10 డాలర్ల స్థాయిని అందుకుంది. చివరికి  19డాలర్లు లాభంతో 1,508 వద్ద స్థిరపడింది. నేడు ఆసియా మార్కెట్లో 2డాలర్ల స్వల్ప నష్టంతో 1,506 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
దేశీయ మార్కెట్లో రూ.38000 పైకి:-
ఒకరోజు సెలవు అనంతరం ప్రారంభమైన దేశీయ పసిడి ఫ్యూచర్లు భారీ లాభాల దిశగా కదులుతున్నాయి. నేడు ఎంసీక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల ధర రూ.494లు లాభపడి రూ.38386.00 గరిష్టాన్ని అందుకున్నాయి. ఉదయం గం.10:15ని.లకు రూ.417లు లాభంతో రూ.38,309.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్నరాత్రి పసిడి ఫ్యూచర్లు సాంకేతికంగా కీలకమైన 1500డాలర్ల పైన ముగియడంతో పాటు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత పసిడి ర్యాలీకి మద్దతునిస్తున్నాయి. 



You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు..హిందల్కో 3% డౌన్‌

Thursday 3rd October 2019

యుఎస్‌ స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతోపాటు, యూరోప్‌ దేశాలలో కార్పోరేట్‌ లాభాలు తగ్గడంతో యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి వెళుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్‌లు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఆర్థిక మాంధ్యం భయాల కారణంగా అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.41 సమయానికి నిఫ్టీ మెటల్‌

58 డాలర్ల దిగువకు క్రూడ్‌ ఆయిల్‌!

Thursday 3rd October 2019

యుఎస్‌ స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతో చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. దీనికితోడు గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే పెరిగాయని ఎనర్జి ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ బుధవారం ప్రకటించడంతో గురువారం చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.3 శాతం నష్టపోయి బారెల్‌ 57.52 డాలర్లకు చేరుకోగా, డబ్యూటీ క్రూడ్‌ 0.2 శాతం నష్టపోయి బారెల్‌ 52.55 డాలర్లకు పడిపోయింది. గత సెషన్‌లో

Most from this category