News


స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 29th November 2019
Markets_main1575002332.png-29945

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు లాభంతో 1,463.75డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. హాంగ్‌కాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారికి మద్దతునిచ్చే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తాజాగా సంతకం చేశారు. దీనికి ప్రతిగా చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడంతో నేడు ఆసియ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. థ్యాంక్స్‌ టు గివింగ్‌ డే సందర్భంగా నిన్నటి రోజున అమెరికా మార్కెట్లకు సెలవు కావడంతో అమెరికా ఫ్యూచర్లు స్వల్పంగా నష్టాల్లో ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్ల నష్టాల ట్రేడ్‌ అవుతుండటం పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఇన్వెస్టర్లు ప్రతికూల సమయాల్లో రక్షణాత్మక చర్యల్లో భాగంగా పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్లు మొగ్గుచూపుతున్నారు. 
దేశీయంగా స్వల్ప లాభాల్లో:- 
ఈక్విటీ మార్కెట్లు ఆల్‌టైం గరిష్టాల వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌కు కొంతమేర తగ్గింది. నేటి ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.23.00ల స్వల్ప లాభంతో రూ.37746.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే నిన్నరాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారక విలువలో రూపాయి 27పైసల వరకు కరిగిపోవడంతో పసిడి ధర 198లు లాభంతో రూ.37,723 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో డిసెంబర్‌ కాంటాక్టు పసిడి ధర రూ.37,500-37,850 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


స్పాట్‌ గోల్డ్‌ 10గ్రాముల పసిడి ధర నిన్నటి(28-11-2019) ముగింపు కోసం ఆయా ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయండి. 

 



You may be interested

ఆర్‌కామ్‌ ఆస్తుల కోసం ఎయిర్‌టెల్‌ రూ.9500 కోట్ల బిడ్‌!

Friday 29th November 2019

రుణాల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం‍టున్న రిలయన్స్‌ కమ్యునికేషన్స్‌ ఆస్తులను కొనుగోలు చేసేందుకు రూ. 9,500 కోట్ల విలువైన షరతులతో కూడిన బిడ్లను టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ సమర్పించిందని టెలికాం పరిశ్రమకు చెందిన ఓ అధికారి తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు వీఎఫ్‌ఎస్‌ఐ హోల్డింగ్స్‌ ప్రై., యూవీ అసెట్‌ రికనస్ట్రక్షన్‌ కంపెనీ కూడా తమ బిడ్లను సీఓసీ(క్రెడిటర్స్‌ కమిటీ)కి అందించాయి. ‘మిగిలిన కంపెనీల కంటే భారతీ ఎయిర్‌టెల్‌

డిసెంబర్‌లో బ్యాంకు షేర్లదే హవా?!

Friday 29th November 2019

డెరివేటివ్స్‌ గణాంకాల సూచన డిసెంబర్‌ సీరిస్‌లోకి నిఫ్టీ షేర్ల రోలోవర్‌ గత మూడు నెలల సరాసరి కన్నా ఎక్కువే ఉంది కానీ అక్టోబర్‌ రోలోవర్లతో పోలిస్తే తగ్గింది. ఇదే సమయంలో బ్యాంకు నిఫ్టీ రోలోవర్లు మూడు నెలల సరాసరికన్నా ఎక్కువగా ఉండడంతో పాటు అక్టోబర్‌ రోలోవర్ల కన్నా అధికంగా నమోదయ్యాయి. దీంతో ప్రధాన సూచీ కన్నా డిసెంబర్‌లో బ్యాంకు సూచీ ఎక్కువ దూసుకుపోయే ఛాన్సుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీలో రోలోవర్లు

Most from this category