News


ఒకేరోజు రూ.600 పెరిగిన పసిడి!

Saturday 22nd February 2020
Markets_main1582346668.png-32000

కోవిడ్‌-19 ప్రభావంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం, రూపాయి బలహీన పడడంతో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో ఒకే రోజు పసిడి ధర రూ.600 పెరిగింది. ఎంసీఎక్స్‌లో ఇది రికార్డు స్థాయి ధర. శుక్రవారం రాత్రి 10 గ్రాముల పసిడి ధర రూ.42,666 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో 25 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,646 డాలర్ల వద్ద ముగిసింది.

(శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)



You may be interested

1850 డాలర్ల వరకూ పుత్తడి పెరగొచ్చు: గోల్డ్‌మెన్‌ శాక్స్‌

Saturday 22nd February 2020

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న బలహీనత, దిగివచ్చిన యూఎస్‌ ఈల్డ్స్‌తో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1,750డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్‌శాక్స్‌ శుక్రవారం తన నివేదికలో పేర్కోంది. వ్యాధి వ్యాప్తి మరింత ఉధృతమైతే రానున్న రోజుల్లో బంగారం ధర 1850డాలర్ల స్థాయిని కూడా అందుకునే అవకాశం ఉందని గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అంచనా వేసింది.  రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర ఇంట్రాడే ఏడేళ్ల గరిష్టస్థాయి(1,651.85)ని

కరోనా కాఫ్‌- యూఎస్‌ మార్కెట్‌ డీలా

Saturday 22nd February 2020

టెక్‌ దిగ్గజాలు బోర్లా.. రెండు వారాల లాభాలకు బ్రేక్‌ గత వారం 1.5 శాతం నష్టం రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్‌ ప్రభావం వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లను దెబ్బ తీసింది. ఇప్పటికే టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ క్యూ1(జనవరి-మార్చి) ఫలితాలు నీరసించనున్నట్లు అంచనా వేయగా.. తాజాగా పానీయాల దిగ్గజం కోక కోలా.. క్యూ1లో అమ్మకాలు క్షీణించనున్నట్లు ప్రకటించింది. దీంతో మార్కెట్లు 1-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. డోజోన్స్‌ 228 పాయింట్లు నష్టపోయి 28,992

Most from this category