News


తెరపైకి ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలు: 18 డాలర్లు పెరిగిన పసిడి

Saturday 21st September 2019
Markets_main1569053661.png-28471

అమెరికా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర పెరిగింది. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చలను చైనా మధ్యలోనే రద్దు చేసుకున్నట్లు కన్పిస్తోందని అమెరికా ప్రతినిధులు తెలిపారు. ఇరాన్‌ తాజాగా మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్‌ ముగిసేసరికి ఔన్స్‌ పసిడి ధర 18డాలర్ల లాభంతో 1,524.05 వద్ద  స్థిరపడింది. దీంతో సెప్టెంబర్‌లో తొలిసారిగా పసిడి ఈ వారాన్ని లాభంతో ముగించింది. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చలో భాగంగా మోంటానాలోని పొలాలను సందర్శించే ప్రణాళికలను చైనా ప్రతినిధి బృందం రద్దు చేసుకుని షెడ్యూల్‌ కంటే ముందుగానే చైనాకు తిరిగి ప్రయాణమైనట్లు అమెరికా అధికారి వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ట్రంప్‌ స్పందిస్తూ ‘‘తాము చైనాతో పూర్తి వాణిజ్య ఒప్పందం కోసం చూస్తున్నాము. అయితే వాణిజ్య చర్చలు 2020 ఎన్నికలకు ముందే విజయవంతం కావల్పిన అవసరం లేదు’’ అన్నారు. ట్రంప్‌ అంతర్గత వాఖ్యలు ఈసారి కూడా చైనాతో పాక్షిక వాణిజ్య ఒప్పందం జరగవచ్చనే సంకేతాలు స్పష్టమయ్యాయి. వాణిజ్య చర్చలపై మరోసారి సందిగ్ధత నెలకొనడంతో నిన్న రాత్రి అమెరికా సూచీలు అరశాతం నష్టంతో ముగిశాయి. మరోవైపు సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై తిరుగుబాటుదారులు చేసిన దాడికి ఇరాన్‌ సాయం చేసినందుకు ప్రతీకారంగా ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని ట్రంప్‌ ఈ వారం ఆరంభంలో ప్రకటించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు వైట్‌హౌస్‌ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక సాధనమైన పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మరోసారి పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇక ఈ వారం మొత్తంగా పసిడి ధర 28డాలర్లు లాభపడింది. 
దేశీయంగా స్వల్ప లాభంతో ముగింపు:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి బాగా లాభడినప్పటికీ.., దేశీయంగా అతి స్వల్పలాభంతో ముగిసింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌ శుక్రవారం రాత్రి ముగింపు సమయానికి అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ. 11.00ల స్వల్పలాభంతో రూ.37697.00 వద్ద స్థిరపడింది. మం‍దగించిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజపరిచేందుకు నిన్న కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 38 పైసలు బలపడి వారం గరిష్టానికి చేరుకోవడం దేశీయంగా పసిడి ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దేశీయంగా ఈ వారంలో పసిడి ధర రూ.173లు పెరిగింది. You may be interested

ట్యాక్స్‌ తగ్గింపుతో లాభపడే రంగాలివే!

Saturday 21st September 2019

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి(సెస్‌, సర్‌చార్జీలను మినహాయించి) తగ్గించింది. కాగా ఈ చర్య వలన దేశీయ కంపెనీల లాభాల్లో 11 శాతం వృద్ధి వుంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉద్దీపనం వలన స్వల్ప, మధ్య కాలానికి గాను ఇండియా ఈక్విటీ మార్కెట్లు ఆకర్షిణీయంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి ఇండియాలో వివిధ రకాల ట్యాక్స్‌ ప్రొవిజన్స్‌ ఉండడం వలన ట్యాక్స్‌

రేట్‌ కట్‌తో భారత్‌ పెట్టుబడులకు గమ్యస్థానం- ఫిచ్‌ రేటింగ్స్‌

Saturday 21st September 2019

కార్పోరేట్‌ తగ్గింపు చర్య ప్రత్యక్షంగానే ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యంపై ప్రభావం చూపుతుందని, కానీ పన్నుల సేకరణ పెరిగే అవకాశం ఉండడంతో ద్రవ్యలోటు ఒత్తిళ్లను అధిగమించవచ్చని ఫిచ్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్, స్నేహదీప్ బోహ్రా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్థికవ్యవస్థపై పాజిటివ్‌ సైన్‌.. కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం, చాలా సానుకూలమైన చర్య. దీని వలన అధిక మొత్తంలో నగదు కార్పోరేట్‌లకు అందుబాటులో ఉంటుంది. ఫలితంగా కార్పోరేట్‌

Most from this category