News


7వారాల గరిష్టానికి పసిడి

Tuesday 24th December 2019
Markets_main1577170489.png-30407

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం 7వారాల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్యంతరం ఒప్పందంపై ఆందోళనలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర కిత్రం ముగింపు(1,488.70 డాలర్లు)తో పోలిస్తే 6డాలర్ల పెరిగి 1,495 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నవంబర్‌ 07 తరువాత పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి విశేషం. ఈ నవంబర్‌లో అమెరికా ఎగుమతులు క్షీణించడంతో నాలుగో త్రైమాసికంలో వృద్ధిపై అనుమానాలు రెకెత్తాయి. మరోవైపు అమెరికా వాణిజ్య చర్చలపై చైనా ఉన్నత దౌత్యవేత్త స్పందిస్తూ ‘‘ఆర్థిక, శాస్త్రీయ ఆంక్షలు చైనా సార్వభౌమత్వానికి దెబ్బతీసే విధంగా ఉన్నాయి’’ వాఖ్యానించారు. వచ్చే ఏడాది నుంచి తమ దేశంలోని దిగుమతయ్యే పోర్క్‌, అవోకాడోలతో పాటు కొన్ని రకాల సెమీకండెక్టర్లపై సుంకాలు తగ్గించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. క్రిస్మస్‌, కొత్త సంవత్సరపు సెలవుల నేపథ్యంలో నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 7.80డాలర్లు పెరిగి 1,488.70 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ ధర పసిడికి 6వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. 
దేశీయ మార్కెట్లో అదే ట్రెండ్‌:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడికి కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. నేడు ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.101లు పెరిగి రూ.38358.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి అమెరికాలో పసిడి ర్యాలీ కారణంగా నిన్న మార్కెట్‌ ముగిసే సరికి రూ.266లు లాభంతో రూ.38,257ల వద్ద స్థిరపడింది.

23-12-2019 నాటి స్పాట్‌ గోల్డ్‌ (10గ్రాముల) పసిడి ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయండి.



You may be interested

విస్తృత ర్యాలీ కొనసాగుతుంది!

Tuesday 24th December 2019

ఎమ్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ సచిన్‌ షా ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు దేశీయ వినిమయ రంగంలో వృద్దిని ఊపందుకునేలా చేస్తాయని, దీంతో అన్ని రంగాల్లో పునరుజ్జీవం కనిపిస్తుందని ఎమ్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ సచిన్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఏడాది మార్కెట్‌ ర్యాలీ విస్తృతమవుతుందని అంచనా వేశారు. చిన్న, మధ్యతరహా స్టాకుల్లో అప్‌ట్రెండ్‌ ఆరంభమవుతుందన్నారు. వీటిలో మంచి మేనేజ్‌మెంట్‌ ఉన్న నాణ్యమైన కంపెనీల షేర్లు ఇతరాల కన్నా ముందంజలో ఉంటాయని,

4రోజూ లాభాల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Tuesday 24th December 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వరుసగా 4రోజూ లాభాల బాట పట్టింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.295.00వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ కంపెనీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఒక దశలో 3శాతం పెరిగి రూ.303.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:45ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.294.75)తో పోలిస్తే 1.78శాతం లాభంతో రూ.300.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు గడిచిన నెలల్లో

Most from this category