News


మూడోరోజూ నష్టాల్లో పసిడి

Wednesday 30th October 2019
Markets_main1572414897.png-29230

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర వరుసగా మూడోరోజూ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో బుధవారం ఔన్స్‌ పసిడి రాత్రి అమెరికా ముగింపు(1,490.50)తో పోలిస్తే 2డాలర్ల నష్టంతో 1488.5డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి రాత్రి అమెరికాలో ఫెడ్‌ ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్లపై తన వైఖరి ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. మందగమనం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజపరిచేందుకు ఈ ఏడాదిలో ఫెడ్‌ వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు ఖాయమైతే పసిడి ధర పుంజుకుంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లో రిస్క్‌-ఆన్‌ సెంటిమెంట్‌ పెరగడం పసిడిపై ఒత్తిడిని పెంచుతోందని బులియన్‌ విశ్లేషకులంటున్నారు. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లోనూ వరుసగా రెండోరోజూ 5డాలర్లు నష్టపోయి 1,490.50 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ ధర పసిడి వారం రోజుల కనిష్ట స్థాయి కావడం గమనార్హం.
దేశీయమార్కెట్లో స్థిరంగా :- 
దేశీయ మార్కెట్లోనూ పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.2లు స్వల్ప లాభంతో రూ.37918.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం నెల గరిష్టం నుంచి పసిడి ధర రూ.2,100లు నష్టపోయింది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల పసిడి ధర రూ.6ల స్వల్ప నష్టంతో రూ.37,916 వద్ద ముగిసింది. 



You may be interested

ఎల్‌ఐసీ లిస్టింగ్‌.. ఇప్పుడే కాదు!

Wednesday 30th October 2019

ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ దేశీయ బీమా కంపెనీల్లో పెద్ద కంపెనీ, దేశీయ సంస్థాగత మదుపరుల్లో పెద్దదైన ఎల్‌ఐసీని లిస్టింగ్‌కు తెచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందని సంస్థ ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పారు. ఎకానమీలో మందగమనం కొనసాగుతున్నా, బీమారంగం మాత్రం మంచి పనితీరు కనబరుస్తోందన్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వివరించారు...  జూలై చివరికి ఎల్‌ఐసీ ఏయూఎం విలువ రూ. 31 లక్షల కోట్లుంది.   ఈ ఏడాది ఈక్విటీల్లో

దుమ్మురేపుతున్న మిడ్‌క్యాప్స్‌!

Wednesday 30th October 2019

-280 స్టాకులు వాటి 200 డీఎంఏకి పైనే    విస్తృత మార్కెట్‌లో చాలా వరకు స్టాకులు ప్రతికూల సెంటిమెంట్‌నే ఎదుర్కొంటున్నప్పటికి, అక్టోబర్‌ 18 నుంచి ఇప్పటి వరకు బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో 70కి పైగా స్టాకులు వాటి 200 డీఎంఏ(డైలీ మూవింగ్‌ యావరేజ్‌) కంటే పైకి  ఎగిశాయి. ఈ సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 3 శాతం పైగా లాభపడింది. దీర్ఘకాలానికి గాను ఈ స్టాకులు బాగున్నాయనే సంకేతాలను ఈ ఇండికేటర్‌ ఇస్తుందన్నది విశ్లేషకుల భావన. ప్రస్తుతం

Most from this category