News


నష్టాల్లో పసిడి

Wednesday 22nd January 2020
Markets_main1579671596.png-31095

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో బుధవారం పసిడి ఫ్యూచర్ల ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో  ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.106లు నష్టంతో రూ.39805.00 కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్‌ తగ్గడం, నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం తదితర అంశాలు పసిడి ప్యూచర్లకు డిమాండ్‌ను తగ్గించాయి. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల పసిడి ధర రూ.39733 వద్ద స్థిరపడింది. 

‘‘వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరమ్‌ చర్చలు, డాలర్‌తో పాటు ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో పసిడి కొంతకాలం పాటు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. పసిడి ట్రేడింగ్‌లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ... పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చు. నేటి ట్రేడింగ్‌లో పసిడి ధర సాంకేతిక కారణాలతో రూ.40వేల ట్రేడయ్యే అవకాశం ఉంది. నేటి ట్రేడింగ్‌లో రూ.40,000-40,200 నిరోధస్థాయి, రూ.39,800- 39,650 రేంజ్‌లో మద్దతు స్థాయి నెలకొని ఉంది’’ ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ నిపుణుడు జతీన్‌ త్రివేదీ తెలిపారు.

అంతర్జాతీయంగా నష్టాల్లోనే:- 
ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు నష్టాన్ని చవిచూశాయి. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 5.15డాలర్లు పతనమై 1,552.75డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియా ఈక్విటీ మార్కెట్ల బలపడటంతో పాటు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ బలపడటం అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లపై అమ్మకాల ఒత్తిడి కలుగజేశాయి. అలాగే నిన్నటి ఇంట్రాడే పసిడి ధర 2వారాల గరిష్టాన్ని అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో రాత్రి అమెరికాలో 2.40డాలర్లు నష్టంతో 1,546 డాలర్ల వద్ద స్థిరపడింది. 



You may be interested

ఈ షేర్లకు దూకుడెక్కువ!

Wednesday 22nd January 2020

జాబితాలో భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ రెండు రోజుల వరస నష్టాలకు చెక్‌ పెడుతూ ప్రారంభంలోనే బౌన్స్‌బ్యాక్‌ అయిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి తిరిగి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. లాభాలను పోగొట్టుకోవడంతోపాటు.. నష్టాల బాట పట్టాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 90 పాయింట్లు క్షీణించి 41,234ను తాకగా.. నిఫ్టీ 32 పాయింట్లు తక్కువగా 12,138 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ఇటీవల జోరు చూపుతున్న మొబైల్‌ రంగ దిగ్గజం భారతీ

సింగపూర్‌ కొత్త ఒప్పందం- ఎఫ్‌పీఐలకు ప్రతికూలం?!

Wednesday 22nd January 2020

భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎక్కువగా సింగపూర్‌ మార్గంలో వస్తుంటారు. అయితే తాజాగా ఇండియా, సింగపూర్‌ మధ్య కుదిరిన ఎంఎల్‌ఐ(మల్టీలేటరల్‌ అగ్రిమెంట్‌)తో ఇండియాకు వచ్చే ఎఫ్‌పీఐలపై నెగిటివ్‌ ప్రభావం పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఇండియాలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఫండ్‌ మేనేజర్లు కేవలం ఇండియాలో పెట్టుబడుల కోసమే సింగపూర్‌లో పాగా వేయలేదని ఇండియా పన్ను

Most from this category