News


పసిడికి కలిసొచ్చిన డాలర్‌ బలహీనత

Saturday 14th December 2019
Markets_main1576307272.png-30226

డాలర్ బలహీనతకు తోడు బాండ్‌ ఈల్డ్స్‌ పతనంతో శుక్రవారం పసిడి ధర లాభంతో ముగిసింది. అమెరికాలో రాత్రి ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు 1,481.20 డాలర్ల వద్ద స్థిరపడింది. బ్రిటన్‌లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘనవిజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగేందుకు (బ్రెగ్జిట్‌)కు అనుకూలంగా ఉండటంతో డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ మూడు శాతం పెరిగింది. ఈ ఏడాది మే నుంచి ఇదే అత్యధిక పెరుగుదల. యూరోతో పోలిస్తే మూడున్నరేళ్ల గరిష్ఠానికి పౌండ్ విలువ ఎగబాకింది. పౌండ్‌ పెరుగుదల కారణంగా డాలర్ ఇండెక్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనై పావుశాతం నష్టపోయి 97.18 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది పసిడి ర్యాలీకి తోడ్పాటునిచ్చింది. మరోవైపు చైనాతో చర్చల విజయవంతపై స్పష్టత కొరవడంతో బాండ్‌ ఈల్డ్‌ పతనం కూడా పసిడికి కలిసొచ్చింది. అమెరికా పదేళ్ల ట్రెజరీ 3.50శాతం నష్టపోయి 1.8218 శాతం వద్ద స్థిరపడింది.  ఇక వారం మొత్తం మీద చూస్తే... ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్లు 17డాలర్లు (అరశాతం) లాభపడ్డాయి.  
వాణిజ్య చర్చల్లో భాగంగా చైనాతో  మొదటి దశ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తెలిపారు. కుదిరిన ఒప్పందం ప్రకారం చైనా దిగుమతులపై డిసెంబర్ 15న విధించాల్సిన సుంకాలను రద్దు చేసుకుంటున్నామని, అందుకు ప్రతిగా చైనా ... అమెరికా వ్యవసాయ, ఇంధన, తయారీ రంగ ఉత్పత్తుల కొనుగోలుకు అంగీకారం తెలిపిందని ట్రంప్‌ పేర్కోనారు. అతి తర్వలో మొదలు కానున్న రెండో దఫా వాణిజ్య చర్చలు వచ్చే ఏడాది ఎన్నికల వరకు కొనసాగుతాయని ట్రంప్‌ తెలిపారు. మరోవైపు చైనా అధికారులు వాణిజ్య చర్చలపై స్పందిస్తూ ‘‘కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం నిర్మాణాత్మకంగా అమలు చేసే విధానం బట్టి రెండో దఫా చర్చలు జరుగుతాయి.’’ అని తెలిపారు. వాణిజ్య చర్చల గురించి తెలిసిన దాని కంటే తెలియాల్సింది చాలా ఉందని పసిడి ట్రేడర్లు భావిస్తున్నారు. అందుకే ఇటీవల పసిడి పతనం ఎక్కువ జరగలేదని బులియన్‌ పండితులు అంటున్నారు. 

దేశీయంగా రూ.229 లాభం:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పెరగడంతో పాటు దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ అక్కడిక్కడే ముగియడంతో రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల ఫిబ్రవరి కాంటాక్టు ధర రూ.229 లాభపడి రూ.37773.00 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా చూస్తే పసిడి ధర స్వల్పంగా రూ.74లు పెరిగింది. 

 You may be interested

డిస్కౌంట్ల హోరు.. కార్ల విక్రయాల జోరు!

Saturday 14th December 2019

డిసెంబర్‌లో పెరిగిన కార్ల విక్రయాలు డిసెంబర్‌ చివరకు వస్తుండడంతో కార్ల కంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లను మరింత పెంచాయి. దీంతో ఈ నెల్లో కార్ల విక్రయాలు మరింత జోరందుకున్నాయి. దాదాపు 5- 15 శాతం మధ్య ఆయా కార్లకంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నాయి. కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న సందర్భంగా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బీఎస్‌4 వాహనాలను పూర్తిగా వదిలించుకునే యత్నంలో భాగంగా కార్ల కంపెనీలు ఇలా

నిఫ్టీ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌!

Saturday 14th December 2019

నిఫ్టీ వరుసగా మూడో సెషన్‌లో(శుక్రవారం) కూడా గ్యాప్‌అప్‌తో ఆరంభమై మంచి లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో 12099 పాయింట్లను తాకింది. ప్రస్తుతం నిఫ్టీ డైలీ, వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్స్‌ ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ క్యాండిల్స్‌ హయ్యర్‌ హై, హయ్యర్‌లో రూపంలోఉన్నాయి. ఇలాంటి క్యాండిల్స్‌ ఏర్పడడం బుల్లిష్‌నెస్‌కు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడు సెషన్ల అప్‌మూవ్‌తో ప్రస్తుత కరెక‌్షన్‌ 11832 పాయింట్ల వద్ద బాటమ్‌ అవుట్‌ అయినట్లు భావిస్తున్నారు. నిఫ్టీ ఇండికేటర్లు

Most from this category