News


5వారాల గరిష్టం వద్ద పసిడి

Friday 1st November 2019
Markets_main1572585812.png-29282

డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత, ఈక్విటీ మార్కెట్ల పతనంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 5వారాల గరిష్టానికి చేరకుంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో డిసెంబర్‌ కాంటాక్టు ఔన్స్‌ పసిడి ధర 1,515.50 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికాతో దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలపై చైనా అధికారులు సందేహాం వ్యక్తం చేస్తున్నట్లు వార్త కథనాలు వెల్లడికావడంతో నిన్నరాత్రి అక్కడి ఈక్విటీ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97స్థాయికి దిగివచ్చింది. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగి నిన్నటి ట్రేడింగ్‌లో 1,516.00డాలర్లను తాకి చివరికి 18డాలర్ల లాభంతో 1,514.80 వద్ద స్థిరపడింది. 
 దేశీయంగా రూ.38500లపైకి:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెట్టింది. నేడు ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.38500లపైన ట్రేడ్‌ అవుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర రూ.490లు లాభపడి రూ.38578.00 వద్ద స్థిరపడ్డాయి. నేటి పసిడి ఫ్యూచర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో రూ.73ల నష్టంతో రూ.38505ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

స్వల్పకాలానికి స్టాక్‌ సిఫార్సులు

Friday 1st November 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం సెషన్లో లాభాలతో మొదలై, నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11.05 సమయానికి నిఫ్టీ 50 9.05 పాయింట్లు నష్టపోయి 11868.40 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 37.86 పాయింట్లు నష్టపోయి 40091.19 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. స్వల్పకాలానికి సంబంధించి విశ్లేషకులు ఇస్తున్న స్టాక్‌ సిఫార్సులు: కునాల్‌ బోత్రా, స్వతంత్ర మార్కెట్‌ విశ్లేషకులు: ఏసీసీ: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1625; స్టాప్‌ లాస్‌: రూ. 1550 బెర్జర్‌ పెయింట్స్‌: అమ్మొచ్చు; టార్గెట్‌ ధర:

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్ల జోరు

Friday 1st November 2019

ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు గురువారం సెషన్‌లో సానుకూలంగా కదులుతున్నాయి. ఫలితంగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 10.40 సమయానికి 1.80 శాతం లాభపడి 2,551.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌ 6.36 శాతం, బ్యాంక్‌ ఇండియా 3.37 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.78 శాతం, పీఎన్‌బీ(పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌) 2.75 శాతం,  ఓరియంటల్‌ బ్యాంక్‌ 2.47 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 2.44 శాతం,

Most from this category