News


ఎగిసిన పసిడి

Tuesday 30th July 2019
Markets_main1564462248.png-27395

ప్రపంచమార్కెట్లో బంగారం ధరలు బలపడుతున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో 6డాలర్లు పెరిగింది. నేటి రాత్రి నుంచి రెండురోజులు పాటు (జూన్‌ 30, 31) జరగనున్న ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అలాగే యూరోపియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం(బ్రెగ్జిట్‌) కష్టతరమైన అంశమని బ్రిటన్‌ కొత్త ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వ్యాఖ్యానించడం కూడా పసిడి ధరకు మద్దతినిస్తున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ రెండు నెలల గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతున్న నేపథ్యంలో నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర 1డాలరు స్వల్పలాభంతో 1,420.40 డాలర్ల వద్ద స్థిరపడింది. 
దేశీయంగా స్వల్ప పెరుగుదల:- 
ఇక దేశీయంగా పసిడి ధర స్వల్పంగా లాభపడింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర రూ.45 స్వల్పలాభంతో రూ.34754.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఈక్విటీ మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో పాటు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం తదితర అంశాలు పసడి ర్యాలీకి అవరోధంగా మారాయి. నిన్నటి రోజు ఎంసీక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.64 నష్టంతో రూ.34,709ల వద్ద స్థిరపడింది.



You may be interested

68.75 వద్ద రూపీ ప్రారంభం

Tuesday 30th July 2019

రూపీ డాలర్‌ మారకంలో 68.75 వద్ద మంగళవారం ప్రారంభమైంది. గత సెషన్లో రూపీ 14 పైసలు బలపడి 68.74 వద్ద ముగిసింది. ఈ నెల 31న జరగనున్న ఫెడ్‌ సమావేశంపై మదుపర్లు దృష్ఠి సారించనున్నారు. ఫలితంగా ఈ రోజు రూపీ తక్కువ పరిధిలో కదాలాడే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. 

రేట్ల కోత అంచనా..పెరిగిన చమురు

Tuesday 30th July 2019

ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న  యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉంటుందనే అంచనాల మధ్య చమురు ధరలు మంగళవారం ట్రేడింగ్‌లో పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.5 శాతం పెరిగి 64.01 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.6 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.21 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 1.2 శాతం

Most from this category