గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల్లో జంప్
By Sakshi

న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నిర్వహణలోని ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల మార్కును దాటాయి. జూలైలో ఏయూఎం రూ.5,079.22 కోట్లుగా నమోదైనట్లు మార్నింగ్‌స్టార్ తాజా డేటాలో వెల్లడైంది. ఈ ఏడాదిలో.. ఆగస్టులో రూ. 4,594 కోట్లు, మేలో రూ. 4,607 కోట్లు, జూన్‌లో రూ. 4,931 కోట్లు ఏయూఎం నమోదైంది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్న కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం, గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్న నేపథ్యంలో గడిచిన నాలుగు నెలలుగా గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల్లో పెరుగుదల నమోదవుతూ వస్తోందని మార్నింగ్‌స్టార్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాస్తవ విశ్లేషించారు. ఆర్థిక మందగమన భయాలు, వాణిజ్య యుద్ధ ఆందోళన, బాండ్ ఈల్డ్ పడిపోవడం వంటి ప్రతికూల వాతావరణంలో బంగారానికి డిమాండ్ ఊపందుకుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ వీకే శర్మ అన్నారు.
You may be interested
థాపర్‌ను తొలగించాలి
Monday 26th August 2019సీజీ పవర్ రుణదాతలు, ఇన్వెస్టర్ల అభిప్రాయం న్యూఢిల్లీ: భారీ కుంభకోణం బైటపడిన నేపథ్యంలో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ చైర్మన్ హోదా నుంచి గౌతమ్ థాపర్‌ను తప్పించాలని సంస్థకు రుణాలిచ్చిన సంస్థలు, ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. సంస్థ ఆస్తులను తనఖా పెట్టి రుణాలు పొందిన కొందరు సిబ్బంది, ఆ నిధులను దారి మళ్లించిన తీరు ఇటీవల విచారణలో బైటపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గవర్నెన్స్‌పరమైన లోపాలను బోర్డు గుర్తించినట్లు స్టాక్
బ్యాంకు మోసాలపై సీవీసీ కమిటీ
Monday 26th August 2019న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే మోసం ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వీటిపై దృష్టి సారించింది. రూ. 50 కోట్ల పైబడిన బ్యాంకు మోసాలను పరిశీలించి, తగు చర్యలు సిఫార్సు చేసేందుకు బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌పై అడ్వైజరీ బోర్డు (ఏబీబీఎఫ్) ఏర్పాటు చేసింది. మాజీ విజిలెన్స్ కమిషనర్ టీఎం భాసిన్ దీనికి సారథ్యం వహిస్తారు. గతంలో దీన్ని అడ్వైజరీ బోర్డ్ ఆన్ బ్యాంక్, కమర్షియల్ అండ్ ఫైనాన్షియల్