News


5వారాల గరిష్టానికి పసిడి

Saturday 2nd November 2019
Markets_main1572684758.png-29308

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్‌ శుక్రవారం 5వారాల గరిష్టం వద్ద స్థిరపడింది. అమెరికాలో నిన్నరాత్రి డిసెంబర్‌ కాంట్రాక్టు ఔన్స్‌ పసిడి ఫ్యూచర్‌ ధర 3.40డాలర్ల నష్టంతో 1,511.40 డాలర్ల వద్ద ముగిసింది. నిన్నరాత్రి అమెరికా అక్టోబర్‌ ఉపాధి కల్పన గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో అక్కడి సూచీలు రికార్డు స్థాయిలని అందుకోవడంతో పసిడి స్వల్ప నష్టాలను చవిచూసింది. అయితే, మాన్యూఫాక్చరింగ్‌ యాక్టివిటీ, బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం పసిడి పతనాన్ని అడ్డుకున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను, అమెరికాతో దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలపై చైనా అధికారులు సందేహాం వ్యక్తం కావడం, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97స్థాయికి దిగిరావడం తదితర అంశాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచడంతో ఒక దశలో 1,518.15 డాలర్ల స్థాయిని తాకింది. ఈ ధర పసిడికి 5వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఇక వారం మొత్తం మీద డిసెంబర్‌ కాంటాక్టు పసిడి ధర 7డాలర్లు (0.40శాతం) లాభపడింది.
దేశీయంగా రూ.38300 పైన ముగింపు:- 
నిన్నరాత్రి ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంట్రాక్టు 10గ్రాములు పసిడి ధర రూ.268 నష్టపోయి రూ.38310.00 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల పతనం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారక విలువలో రూపాయి విలువ 11 పైసలు బలపడటం తదితర కారణాలతో పసిడి ధర దిగివచ్చింది. ఇక వారం మొత్తంగా చూస్తే పసిడి ధర రూ.388 లాభపడింది. సెప్టెంబర్‌లో రూ.39,885 వద్ద రికార్డు గరిష్టస్థాయిని తాకిన సంగతి తెలిసిందే. 



You may be interested

మిశ్రమంగా ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 2nd November 2019

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. అక్టోబర్‌లో అమెరికా ఉపాధి కల్పన మార్కెట్‌ అంచనాలకు మించి నమోదు కావడం, వాణిజ్య చర్చలు సఫలం దిశగా సాగుతున్నాయని వైట్‌హౌస్‌ అధికారుల ప్రకటించిన నేపథ్యంలో నిన్న అక్కడి సూచీలు రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనై 97.23 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ

ఈ షేర్లు కొనొచ్చు

Saturday 2nd November 2019

పటిష్టమైన అప్‌ట్రెండ్‌లో వున్న ప్రస్తుత మార్కెట్లో మధ్య కాలానికి రాబడుల్ని ఇవ్వగలిగే షేర్లను వివిధ విశ్లేషకులు సూచించారు. అవి.... విశ్లేషకులు: ముస్తఫా నదీమ్, సీఈఓ, ఎపిక్ రీసెర్చ్ వోల్టాస్ లిమిటెడ్: కొనచ్చు: ప్రస్తుత ధర: రూ .713 | టార్గెట్‌ ధర: రూ 775-830 | స్టాప్‌ లాస్‌: రూ .650 | అప్‌ సైడ్‌: 16 శాతం పెరగొచ్చు ఎయిర్ కండీషనర్(ఏసీ) మార్కెట్ గత కొన్నేళ్ల నుంచి బలమైన వృద్ధిని కనబరుస్తోంది. ఈ

Most from this category