News


భగ్గుమన్న బంగారం

Friday 3rd January 2020
Markets_main1578025220.png-30641

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర ఉదయం ట్రేడింగ్‌లో భారీగా లాభపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం, అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్ల ధర 4నెలల గరిష్టానికి చేరుకోవడంతో దేశీయ పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు పసిడి ధర రూ.39,500.00 వద్ద ప్రారంభమైంది. ఇరాక్‌లోని బాగ్దాద్‌పై అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో అం‍తర్జాతీయ ముడిచమురు ధరలు భగ్గుమనడంతో రూపాయి విలువ బలహీనపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడంతో పాటు అమెరికా మధ్య ప్రా‍చ్యదేశాల్లో నెలకొన్న భౌగోళిక ఉద్రికత్తలతో అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్ల ధర 4నెలల గరిష్టానికి ఎగిసింది. ఈ సానుకూల పరిణామాలతో  ఉదయం గం.9:20ని.లకు క్రితం ముగింపు(రూ.39,277)తో పోలిస్తే రూ.411ల లాభంతో రూ.39688.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర రూ.210లు లాభంతో రూ.39,277 వద్ద ముగిసింది. ఇక నిన్నరాత్రి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 5 డాలర్లు పెరిగి 1,528.10 వద్ద స్థిరపడింది. 



You may be interested

ఇంట్రాడే మార్జిన్లకు చెల్లుచీటి!

Friday 3rd January 2020

పూర్తి మార్జిన్‌ ఉంచాలని ఎక్చేంజ్‌ల ఆదేశాలు భారీగా తగ్గనున్న వాల్యూంలు చిన్న బ్రోకరేజ్‌ల కనుమరుగు తప్పదంటున్న నిపుణులు ట్రేడర్లలో బాగా పాపులరైన ఇంట్రాడే ట్రేడింగ్‌లో స్వల్పమార్జిన్ల కాలం ముగిసిపోతోంది. స్టాక్‌ లేదా డెరివేటివ్‌ విలువ లేదా మార్జిన్‌లో కొంత మొత్తం ఉంచి ఇంట్రాడేలో ట్రేడింగ్‌ చేసుకునే వెసులుబాటు ఇప్పటివరకు ఉంది. కానీ ఇకపై స్టాక్‌ లేదా డెరివేటివ్‌ విలువ లేదా మార్జిన్‌ మొత్తం ఉంటేనే క్లయింట్లను ఇంట్రాడే ట్రేడింగ్‌కు అనుమతించాలని ఎక్చేంజ్‌లు బ్రోకర్లను ఆదేశించాయి.

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు...సెన్సెక్స్‌ 120 పాయింట్లు డౌన్‌

Friday 3rd January 2020

 ఇరాక్‌ విమానాశ్రయంపై అమెరికా మిలటరీ దాడులు నిర్వహించి, ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులను కాల్చివేయడంతో హఠాత్తుగా ఆసియా స్టాక్‌ సూచీలు పడిపోయిన నేపథ్యంలో దేశీయ స్టాక్‌ సూచీలు శుక్రవారం క్షీణతతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 120 పాయింట్ల క్షీణతతో 41,500 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల తగ్గుదలతో 12,245 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. 

Most from this category