News


తగ్గిన పసిడి

Thursday 19th September 2019
Markets_main1568874109.png-28430

వడ్డీరేట్ల తగ్గింపు రానున్న నెలల్లో ఉండకపోవచ్చనే సంకేతాలతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 11.50డాలర్లు నష్టపోయి 1,504.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతుంది. అమెరికాలో నిన్న ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లపై వైఖరీ ప్రకటించింది. అందరి అంచనాలకు తగ్గట్లుగానే వరుసగా రెండోసారి వడ్డీరేట్లపై పావు శాతం మేర తగ్గించింది. అయితే లేబర్‌ మార్కెట్‌ బలంగా ఉన్నందున రేట్ల కోత ఈ ఏడాది ఉండకవపోవచ్చని సంకేతాలిచ్చింది. భవిష్యత్‌లో వడ్డీరేట్లపై తగ్గింపై సందేహాలు తలెత్తడంతో పసిడి ట్రేడర్లు నిరాశ చెంది పసిడిలో లాభాల స్వీకరణకు పూనుకుంటున్నారు. పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 
దేశీయంగా మూడురోజు నష్టాల ట్రేడింగ్‌:-
దేశీయ ఎంసీక్స్‌ మార్కెట్లో పసిడి ధర మూడురోజు నష్టాల బాట పట్టింది.  నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర క్రితం ముగింపు(రూ.37849)తో పోలిస్తే రూ.250లు నష్టపోయి 37600 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న రాత్రి పసిడి ధర రూ.167 నష్టపోయి రూ.37849 వద్ద స్థిరపడింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి రివకరి తదితర కారణాలు దేశీయంగా పసిడి ధరకు ప్రతికూలాంశాలుగా మారుతున్నాయి. 



You may be interested

యస్‌బ్యాంక్‌ 8 శాతం క్రాష్‌

Thursday 19th September 2019

ప్రైవేట్‌రంగ యస్‌ బ్యాంక్‌ షేర్లు వరుసగా 4వరోజూ నష్టాల బాట పట్టాయి. నేడు బ్యాంక్‌ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.64.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. యస్‌బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన రాణాకపూర్‌కు చెందిన మోర్గాన్‌ క్రెడిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎంసీపీఎల్‌) నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లపై రేటింగ్‌ను కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎ(-) రేటింగ్‌ నుంచి బిబిబి(-)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే రియల్టీ ఫైనాన్సింగ్‌ కంపెనీ అల్టికో డిఫాల్ట్‌ అయిన ఫలితంగా నేటి ఉదయం సెషన్‌లో యస్‌

62 డాలర్ల వద్దకు చమురు

Thursday 19th September 2019

ఈ నెల చివరి నాటికి చమురు ఉత్పత్తిని పూర్తిగి పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించడంతో చమురు గత రాత్రి ప్రపంచ మార్కెట్లో 62 డాలర్ల సమీపానికి పడిపోయింది.  గురువారం ఉదయం ట్రేడింగ్‌లో స్వల్పంగా లాభపడి ట్రేడవుతోంది. ఉదయం 10.06 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.03 శాతం లాభపడి బారెల్‌ 62.68 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.19 శాతం లాభపడి బారెల్‌ 58.15 డాలర్ల వద్ద​ట్రేడవుతున్నాయి.     ఈ నెల చివరి నాటికి

Most from this category