News


తగ్గిన పసిడి ధర

Thursday 30th May 2019
Markets_main1559193878.png-25991

ప్రపంచమార్కెట్లో పసిడి గురువారం తగ్గుముఖం పట్టింది. బాండ్స్‌ ఈల్డ్‌ ర్యాలీ చేయడం, డాలర్‌ ఇండెక్స్‌ రెండేళ్ల గరిష్టస్థాయిలో ట్రేడ్‌ అవుతుండం ఇందుకు నేపథ్యం. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 4.50డాలర్లు నష్టపోయి 1,276.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిగా యూఎస్‌ ట్రెజరీ బాండ్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు డాలర్‌ బలపడటంతో పసిడిని అధికంగా వినియోగించే భారత్‌, చైనాలు కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నాయని ఓసీబీసీ బ్యాంక్‌ ఆర్థికవేత్త హౌయ్ లీ అభిప్రాయపడ్డారు. పసిడి ధర 1300డాలర్ల స్థాయిని అందుకోవాలంటే ముందుగా 1289డాలర్ల స్థాయిని అధిగమించాల్సి ఉంటుందని,  1,275- 1,289డాలర్ల రేంజ్‌లో పసిడి గట్టి నిరోధస్థాయి కలిగి ఉందని అయన అభిప్రాయపడ్డారు. 
దేశీయంగానూ తగ్గుదలే:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే పసిడి దేశీయంగా పసిడి తగ్గుముఖం పట్టింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.153.00 నష్టంతో రూ.31580.00 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ధరపై ప్రభావం చూసే రూపాయి 5 పైసలు స్వల్పంగా బలపడి 69.78 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నటి ఫారెక్స్‌ మార్కెట్లో డాల‌ర్ మార‌కంలో రూపాయి 14పైస‌లు న‌ష్టపోవడంతో ఎంసీఎక్స్ ప‌సిడి ధ‌ర రూ.193లు లాభ‌ప‌డి రూ.31733.00 వద్ద ముగిసింది. You may be interested

సన్‌ఫార్మాపై బుల్లిష్‌.. ఎంఅండ్‌ఎం డౌన్‌గ్రేడ్‌

Thursday 30th May 2019

క్యు4 ఫలితాల అనంతరం బ్రోకరేజ్‌ల ధృక్పథం మార్చి త్రైమాసిక ఫలితాల అనంతరం పలు బ్రోకరేజ్‌లు సన్‌ఫార్మా షేరుపై బుల్లిష్‌ ధృక్పథం వెలిబుచ్చాయి. ఫలితాలు బలహీనంగా ఉన్నా, కంపెనీపై నమ్మకం ఉంచాయి. అయితే కొన్ని బ్రోకరేజ్‌లు మాత్రం షేరు టార్గెట్‌ను భారీగా తగ్గించాయి. బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.. క్యు4లో పేలవ ఫలితాలు ప్రకటించిన ఎంఅండ్‌ఎంపై బ్రోకరేజ్‌లు పెదవివిరిచాయి. పలు సంస్థలు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ వెలిబుచ్చాయి.  సీఎల్‌ఎస్‌ఏ- స్టాకురేటింగ్‌ను సీఎల్‌ఎస్‌ఏ కొనొచ్చు నుంచి అండర్‌పెర్ఫామ్‌కు డౌన్‌గ్రేడ్‌

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 30th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  భార‌తీ ఎయిర్‌టెల్‌:- సింగ‌పూర్ టెలికాం దిగ్గజ కంపెనీ సైన్‌టెల్ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా 17 కోట్ల ఈక్విటీ షేర్లను స‌బ్ స్క్రైబ్ చేసుకుంది. ఈ ఈ సబ్‌స్క్రిప్షన్‌ విలువ రూ.3,740 కోట్లుగా ఉంది. మ‌న్ ప‌సంద్‌:- జీఎస్టీ చెల్లింపు విష‌యంలో మోసానికి పాల్పడిన కంపెనీ అధికారులు అరెస్ట్ అయ్యారు. నిందితుల‌కు కోర్టు బెయిల్ నిరాక‌రించింది.  చోళ‌మండ‌లం ఇన్వెస్ట్‌మెంట్‌:- యూఎస్ డాల‌ర్ల బాండ్ల  రూపంలో

Most from this category