News


1500డాలర్ల దిగువకు పసిడి

Tuesday 10th September 2019
Markets_main1568104883.png-28288

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం 1500డాలర్ల దిగువకు తగ్గింది. ఆర్థిక మందగమనంలో ఉన్న వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలు ప్రకటించవచ్చనే అంచనాలు, అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య చర్చలు ఫలించవచ్చనే ఆశాహనంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తన పెట్టుబడులను రిస్క్‌ సాధనమైన స్టాక్‌ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గితోంది. నేడు ఆసియాలో ఉదయం ట్రేడింగ్లో ఔన్స్‌ పసిడి ధర 17డాలర్లు క్షీణించి 1500డాలర్ల దిగువకు పతనమై 1,494.45 వద్ద కనిష్టాన్ని అందుకుంది. పసిడికిది వరుసగా 4రోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. ఒకవేళ పసిడి 1490 డాలర్ల వద్ద పటిష్ట స్థాయిని ఏర్పాటు చేసుకుంటే స్థిరంగా కదిలే అవకాశం ఉంది. 1,480డాలర్ల మద్దతుస్థాయిని కోల్పోతే, తిరిగి 1,425డాలర్ల స్థాయికి పతనమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచానవేస్తున్నారు.
నేటి సాయంత్రం వరకు ఫారెక్స్‌ మార్కెట్లు సెలవు:-
నేడు మొహర్రం సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌ సాయంత్రం వరకు పనిచేయవు. తిరిగి సాయంత్రం 5గంటల తర్వాత నుంచే ట్రేడింగ్‌ మొదలవుతోంది. నిన్నరాత్రి ట్రేడింగ్‌లో పసిడి ధర రూ.81.00లు నష్టపోయింది. నిన్నరాత్రి ఎంసీఎక్స్ ముగిసే సరికి రూ.38472.00 వద్ద స్థిరపడింది. ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1500డాలర్ల దిగువున ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో దేశీయంగా పసిడి ధర దిగివచ్చే అవకాశం ఉంది. 



You may be interested

ఈ వారం 11200పాయింట్ల వరకు ర్యాలీ?!

Tuesday 10th September 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా ఈ వారంలో నిఫ్టీ తన 200 రోజుల డీఎంఏ స్థాయి 11200 వద్దకు చేరుతుందని టెక్నికల్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాల్‌ ఆప్షన్‌ విక్రేతలు(రైటర్లు) 10900 పాయింట్ల వద్ద  తమ షార్టు పొజిషన్లను(12వతేదీ ఎక్స్‌పైరీవి) కవర్‌ చేశారని, మరోవైపు 10800- 11000 పాయింట్ల(12వ తేదీ ఎక్స్‌పైరీవి) వద్ద పుట్‌ రైటింగ్‌ జరిపారని తెలియజేశారు. అందువల్ల క్రమంగా మార్కెట్‌ ఈ వారం ముందుకే సాగుతుందంటున్నారు. ముఖ్యంగా కాల్‌రైటర్లు షార్ట్‌కవరింగ్‌ చేయడం

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు

Tuesday 10th September 2019

చైనా ఫ్యాక్టరీ గేట్‌ ధరలు (ఉత్పత్తులకు ఫ్యాక్టరీ నిర్ణయించే ధరలు)  మూడేళ్ల కనిష్టానికి పతనం కావడంతో మంగళవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌, స్ట్రైట్స్‌ టైమ్స్‌, కోప్పీ, హాంగ్‌సెంగ్‌ సూచీలు అరశాతం వరకు లాభపడగా, తైవాన్‌ వెయిటైడ్‌, సెట్‌కాంపోజిట్‌, జకర్తా కాంపోజిట్‌, షాంఘై కాంపోజిట్‌ సూచీలు అరశాతం నష్టపోయాయి. దేశ, విదేశాల్లో డిమాండ్‌ తగ్గడంతో కొన్ని వ్యాపారాల్లో ధరలను తగ్గించిన కారణంగా ఆగస్ట్‌లో వార్షిక ప్రాతిపదికన

Most from this category