News


ఈక్విటీ ర్యాలీతో తగ్గిన పసిడి

Saturday 17th August 2019
Markets_main1566025159.png-27834

ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడంతో పసిడి ఫ్యూచర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్‌ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి 7.60 నష్టపోయి 1,523.60 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ వారంల మొత్తంలో 15 డాలర్లు లాభపడిన పసిడికి ఇది మూడో వారమూ లాభాల ముగింపు. ఇదేవారంలో 1,490.75 - 1,545.95 రేంజ్‌లో ట్రేడైంది. జర్మనీ ఆర్థిక ఉద్దీపన చర్చలతో పాటు అమెరికా యూఎస్‌ జూలై కన్జూ‍్యమర్‌ గణాంకాలు మార్కెట్‌ వర్గాలకు అనుగుణంగా నమోదు కావడంతో పసిడి ధరలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో రెండు వారాల గరిష్టస్థాయిని అందుకుంది.  ‘‘ఈక్విటీ మార్కెట్లు, ఇతర రిస్క్‌ అసెట్‌లో సెంటిమెంట్‌ బలపడినప్పటికీ.., రక్షణాత్మక సాధనమైన పసిడికి ఇంకా డిమాండ్‌ తగ్గలేదు. ఆర్థిక మాంద్య భయాలు, ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత తదితర అంశాంలు వచ్చేవారంలో పసిడి డిమాండ్‌కు కలిగింవచ్చు. అయితే మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలేవి లేకపోతే పసిడి కొంత కన్షాలిడేషన్‌కు గురికావచ్చు’’ అని టీడీ సెక్యూరిటీస్ బ్రోకరేజ్‌ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
దేశీయంగా రూ.38000 దిగువున ముగింపు:- 
ఎంసీఎక్స్‌లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర ఈ వారాన్ని రూ.38000ల దిగువున ముగించింది. పారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 13పైసలు బలపడటంతో పాటు, గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం పసిడి ధర నష్టపోయింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సరికి అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.225లు నష్టపోయి రూ.37938.00ల వద్ద స్థిరపడింది. ఇక దేశీయంగా 4రోజుల పాటు జరిగిన ట్రేడింగ్‌లో రూ.146లు మేర నష్టపోయింది. 



You may be interested

త్వరలో ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ

Saturday 17th August 2019

సెబీకి ఐపీఓ ముసాయిదా పత్రాలు సమర్పణ రూ.1200 కోట్ల సమీకరణ ఫైనాన్స్‌ రంగలో సేవలు అందించే ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా బ్యాంకు మొత్తం రూ.1200 కోట్ల నిధులను సమీరించే యోచనలో ఉంది. ఈ మేరకు అనుమతుల కోసం ఆగస్ట్‌ 16న మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ బ్యాంక్‌,

గోల్డ్‌ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం!

Saturday 17th August 2019

అంతర్జాతీయ మందగమన పరిస్థితులు తగ్గకపోవడంతో పాటు ట్రేడ్‌వార్‌ అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌)లో అధికంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఇన్వెస్టర్లు ఏకంగా 2.6 కోట్ల డాలర్ల పెట్టుబడులను గోల్డ్‌ ఈటీఎఫ్‌లో పెట్టారని, మార్చి 2013 తర్వాత ఇదే అత్యధికమని ప్రపంచ గోల్డ్‌ సమాఖ్య విడుదల చేసిన డేటా పేర్కొంది. కాగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో బుల్‌ రన్‌ ఇంకొంత కాలం కొనసాగే అవకాశం ఉందని

Most from this category