News


పసిడి 10డాలర్లు పతనం

Tuesday 20th August 2019
Markets_main1566276016.png-27877

డాలర్‌ ఇండెక్స్‌ 3వారాల గరిష్టాన్ని తాకడంతో పాటు ఈక్విటీ మార్కెట్లలలో కొనుగోళ్లు నెలకొనడంతో మంగళవారం పసిడి ధర 10డాలర్లు పతనమైంది. ఇటీవల పలు దేశాల రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించిన ఉద్దీపనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మెరుగుపరస్తాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తిరిగి ఈక్విటీ కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గితోంది. నేటి ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 6.35 డాలర్లు నష్టపోయి 1,505.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోం‍ది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు 1శాతం ర్యాలీ చేయడంతో పసిడి ధర అక్కడి మార్కెట్లో అరశాతం నష్టపోయి 1,511.60 వద్ద స్థిరపడింది. 
దేశీయంగా స్వల్ప నష్టం:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 10డాలర్ల మేర నష్టపోయినప్పటికీ.., దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా నష్టపోయింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత పసిడి పతనాన్ని అడ్డుకుంటోంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 22 పైసలు క్షీణించింది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.114ల నష్టంతో 37709.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికే 10గ్రాముల పసిడి ధర రూ.115లు నష్టపోయి రూ.37,823 వద్ద స్థిరపడింది. ఇటీవల దేశీయ ఎంసీఎక్స్‌లో మార్కెట్లో గరిష్ట ధర (రూ.38,666) నుంచి 1000లు వెనక్కి వచ్చింది.



You may be interested

బ్యాంక్‌ షేర్ల పతనం..పాజిటివ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Tuesday 20th August 2019

రూపీ విలువ డాలర్‌ మారకంలో తగ్గడంతో పాటు ప్రభుత్వం ప్రకటించనున్న ఉద్దీపన ప్యాకేజీ ఆలస్యం కానుండడంతో దేశియ మార్కెట్‌లు మంగళవారం నష్టాలో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 9.58 సమయానికి 197.50 పాయింట్లు నష్టపోయి 28042.15 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.46 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.42 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 0.37 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.

ఐటీ షేర్ల ర్యాలీ: లాభాల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌

Tuesday 20th August 2019

దేశియ కరెన్సీ డాలర్‌ మారకంలో బలహీనపడడంతో ఐటీ షేర్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం 9.31 సమయానికి 1.46 శాతం లాభపడి 15,640.95 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన టీసీఎస్‌ 1.14 శాతం లాభపడి రూ. 2,172.00 వద్ద, , ఒరాకిల్‌ ఫైనాన్షియల్స్‌ 0.87 శాతం లాభపడి రూ. 3,012.00 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో మైండ్‌ ట్రీ 2.38 శాతం, ఇన్ఫోసిస్‌

Most from this category