News


డాలర్‌ ఎఫెక్ట్‌: నష్టాల్లో పసిడి

Friday 30th August 2019
Markets_main1567141388.png-28102

డాలర్‌ ఇండెక్స్‌ నెలగరిష్టానికి చేరుకోవడంతో పాటు అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా నష్టపోయింది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 6 డాలర్లు నష్టపోయి 1,531 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెప్టెంబర్‌1 నుంచి 300 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై అమెరికా విధించబోయే అదనంగా 5శాతం పన్ను విధింపు అంశంపై అమెరికా వాణిజ్య అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు చైనా చైనా వాణిజ్య శాఖ మంత్రి గురువారం ప్రకటించారు. ఈ అదనపు పన్ను పెంపును రద్దు చేయడం చాలా ముఖ్యమని, అమెరికాతో వాణిజ్య వివాదాలు కోరుకోవడంలేదంటూ ఆయన తెలిపారు. సెప్టెంబర్1 అదనపు సుంకాల విధింపునకు ముందుకు చైనాతో కొన్ని చర్యలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. దీర్ఘకాలికంగా జరుతున్న వాణిజ్య సంఘర్షణను పరిష్కరించుకోడానికి ఇరుదేశాలు ముందడగు వేయడంతో పసిడిపై అమ్మకాల ఒత్తిడికి నెలకొంది. వాణిజ్య చర్చల పునఃప్రారంభ నేపథ్యంలో అమెరికాతో పాటు ఆసియా మార్కెట్లు సానుకూలంగా స్పందిచాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగియగా, నేడు ఆసియా పలు ప్రధాన మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్‌ ఇండెక్స్‌ నెలరోజుల గరిష్టానికి చేరుకోవడం కూడా పసిడి ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అంశం తెరపైకి రావడంతో యూరో బలహీనత డాలర్‌ ఇండెక్స్‌కు కలిసొచ్చింది. ఫలితంగా నిన్నరాత్రి అమెరికాలో ఆరు ప్రధాన ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ నెలరోజుల గరిష్టాన్ని అందుకుంది. నేటి ట్రేడింగ్‌లో కూడా స్థిరంగా కదలాడుతుంది.
దేశీయంగా స్వల్ప నష్టాల్లో:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లో పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల ట్రేడింగ్‌, రూపాయి ఫ్లాట్‌ ట్రేడింగ్‌ తదితర అంశాలు పసిడికి ప్రతికూలాంశాలుగా మారాయి. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్డు 10గ్రాముల పసిడి ధర క్రితం గతవారం ముగింపు ధర(రూ.38803)తో పోలిస్తే రూ.13.00 ల స్వల్ప నష్టంతో రూ.38790.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఈ కంపెనీలు డీపాల్ట్‌కు దగ్గరగా ఉన్నాయా?

Friday 30th August 2019

  గత కొన్ని వారాల నుంచి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, ప్రస్తుతం చాలా కంపెనీల రుణాలు వాటి మార్కెట్‌ క్యాప్‌ కంటే అధికంగా మారాయి. బీఎస్‌ఈలో నమోదైన 190 కంపెనీలను తీసుకుంటే వాటి మొత్తం రుణాలు అగష్టు 26, 2019 నాటికి, రూ. 18.89 లక్షల కోట్లుగా ఉండగా, ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ. 5.54 లక్షల కోట్లను కూడా దాటలేదని ఏసీఈ ఈక్విటీ ఓ నివెదికలో

చమురుపై హరికేన్‌ ప్రభావం!

Friday 30th August 2019

కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ వృద్ధి, చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరుగుతున్నాయి. ఫలితంగా చమురు ధరలు శుక్రవారం ట్రేడింగ్‌లో(ఉదయం 0050 జీఎంటీ(గ్రీనిచ్‌ మీన్‌ టైం) సమయానికి) తగ్గాయి. యుఎస్‌ చమురు నిల్వలు గత వారం అంచనాల కంటే అధికంగా తగ్గడంతో పాటు హరికేన్‌ ఫ్లోరిడా వైపు కదులుతుండడంతో యుఎస్‌ క్రూడ్‌ ధరలు గత వారం 4 శాతం మేర పెరిగాయి. కాగా శుక్రవారం ట్రేడింగ్‌లో యుఎస్‌ క్రూడ్‌ 0.1 శాతం

Most from this category