News


పసిడికి తిరిగి డిమాండ్‌ పెరుగుతుంది!

Friday 8th November 2019
Markets_main1573204861.png-29451

అధిక ధరలు కారణంగా బంగారు ఆభరణాలకు డిమాండ్‌ భారీగా తగ్గింది. తక్కువ కాలంలో ఇంత మొత్తంలో బంగారం ధరలు పెరగడం మొదటి సారిగా చూస్తున్నాం’ అని  వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఇండియా, ఎండీ, పీఆర్‌ సోమసుందరమ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..
బంగారం కొనుగోళ్లు తగ్గాయి..
ధరలు అధికంగా పెరగడంతో బంగారం ఆభరణాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతోపాటు బంగారం ధరలు పెరిగినప్పుడు, దానిని సొమ్ము చేసుకోవడం సాధరణం. పడిపోతున్న సెంటిమెంట్‌తో పాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతో ఈ ట్రెండ్‌ను ముందే ఊహించాం. ఇండియాలో మాత్రమే ఈ దృక్పథం లేదు. అంతర్జాతీయంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పెరిగిన బంగారం ధరలను సొమ్ము చేసుకోవడంతో బంగారం రిసైక్లింగ్‌ 10 శాతం పెరిగింది. బంగారాన్ని విక్రయించడం లేదా ఇతర కారణాల వలన బంగారం కొనుగోళ్లు మాత్రం తగ్గాయి. 
అప్పుడు కూడా ఇంతే..
బంగారం డిమాండ్‌ 2016 లో కూడా పడిపోయింది. కానీ అప్పుడు పతనానికి నిర్ధిష్టమైన కారణాలున్నాయి. ప్రభుత్వం ఆభరణాలపై ఎక్సైజ్‌ డ్యూటీని విధించడంతో, ఆర్థిక సంవత్సరం 2016 ద్వితియ క్యార్టర్‌లో ఆభరణాల షాపులు 45 రోజుల వరకు మూతబడే ఉన్నాయి. డిమాండ్‌ భారీగా పడిపోయిన త్రైమాసికాలలో ఇది ముందుంటుంది. ఆ త్రైమాసికం తర్వాత ప్రస్తుత త్రైమాసికంలోనే బంగారం డిమాండ్‌ భారీగా పడిపోయింది. గత 15 ఏళ్లలో బంగారం డిమాండ్‌ భారీగా పడిపోయిన త్రైమాసికాలలో ప్రస్తుత త్రైమాసికం రెండవది. ఖచ్చితంగా బంగారం ధరలు గణనీయంగా పెరగడమే దీనికి కారణం. బంగారం ధరలు పెరిగినప్పుడు ప్రజలు వేచి చూసే ధోరణిని అనుసరిస్తారు. స్వల్ప కాలంలోనే బంగారం విపరీతంగా పెరగడంతో ప్రస్తుత పరిస్థితికి సర్దుబాటు కావడానికి ప్రజలకు కొంత సమయం పడుతుంది. 
ధరలు తగ్గితే ఆకర్షిస్తుంది..
ధరలు తగ్గినప్పుడు బంగారం ఆకర్షణీయంగా మారుతుంది. ఇండియాలో కేవలం ధనవంతులు మాత్రమే బంగారాన్ని కొనుగోళ్లు చేయడం లేదు. మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనుగోళ్లకు అధికంగా మొగ్గుచూపుతారు. ఒకవేళ 200 మిలియన్‌ ప్రజలు ఒక గ్రాము బంగారాన్ని కొనుగోలు చేసినట్టయితే, 200 టన్నుల బంగారానికి డిమాండ్‌ ఏర్పడుతుంది. మేము ఇండియా మార్కెట్‌ను భిన్నంగా చూస్తున్నాం. 
  స్వల్పకాలంలో బౌతిక డిమాండ్‌ బంగారం ధరలపై ఎటువంటి ప్రభావం చూపదు. అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా యుఎస్‌ వడ్డీ రేట్లు. కామె‍క్స్‌(సీఓఎంఈఎక్స్‌), ఈటీఎఫ్‌ లు బంగారం ధరలను, డిమాండ్‌ ప్రవాహాన్ని నిర్ధారిస్తాయి. ఒక వేళ ధరలు పెరిగితే డిమాండ్‌ తగ్గుతుంది. దీర్ఘకాలానికైతే బంగారం ధరలకు బౌతిక డిమాండ్‌ మద్ధతు ఖచ్చితంగా అవసరం. కానీ స్వల్ప కాలంలో బౌతిక డిమాండ్‌లో  వచ్చే మార్పు, బంగారం ధరలపై ఎటువంటి ప్రభావం చూపదు. ఈ త్రైమాసికంలో దీనిని గమనించాం. యురోప్‌, యుఎస్‌ అంశాలు ఈటీఎఫ్‌ల ఇన్‌ఫ్లో  పెరగడానికి కారణమయ్యాయి. బంగారం డిమాండ్‌ తిరిగి పుంజుకుంటుంది. బంగారు ఆభరణాలు కలిగివున్న ప్రజలైనా బంగారం ఇతర రూపాల్లోకి మారుతారు. బంగారం ఆధారిత ఫైనాన్సియల్‌ సేవలు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. You may be interested

30 కంపెనీల్లో ప్రమోటర్ల తనఖాలు పెరిగాయ్‌..!

Friday 8th November 2019

 ప్రమోటర్ల తనఖా చేసిన వాటా రెండో క్వార్టర్లో 2.52శాతానికి చేరుకుంది. జూన్‌ త్రైమాసికంలో ఈ వాటా 2.47శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌ మొత్తం క్యాపిటలైజేషన్‌లో 1.24శాతానికి సమానమైన ప్రమోటర్ల ఈక్విటీ షేర్లు తనఖాలో ఉన్నట్లు కోటక్ ఇంటర్నేషనల్‌ ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. తనఖా పెట్టిన షేర్ల ద్వారా సేకరించిన నిధులు... వాస్తవానికి కంపెనీ రోజువారీ వ్యాపారం సజావుగా నిర్వహించడానికి అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ను పెంచడానికి సహాయపడుతుంది.  వ్యాపార విస్తరణకు నిధుల

టీసీఎస్‌ నుంచి ఇన్ఫీ వైపు మొగ్గుతున్న ఎంఎఫ్‌లు

Friday 8th November 2019

దిగివచ్చిన వాల్యూషన్లే కారణం బడా ఫండ్‌ మేనేజర్ల ఆసక్తి క్రమంగా టీసీఎస్‌ షేరు నుంచి ఇన్ఫోసిస్‌ షేరు వైపు మరలుతున్నట్లు కనిపిస్తోందని మ్యూచువల్‌ ఫండ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు షేర్లూ ప్రతిఒక్కరూ తమ పోర్టుఫోలియోలో ఉంచుకోవాల్సినవేనని, కాకపోతే ప్రస్తుతం బడా ఇన్వెస్టర్ల మొగ్గు కొంతమేర ఇన్ఫీవైపు ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని తాజా గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి. గత ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలో ఇన్ఫీ షేరు దాదాపు 11 శాతం

Most from this category