News


మూడేళ్ల కనిష్ఠానికి బంగారం డిమాండ్‌

Tuesday 5th November 2019
Markets_main1572950244.png-29372

ఇండియాలో ఊహించినట్టుగానే బంగారం డిమాండ్‌ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని డబ్యూజీసీ(వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌) మంగళవారం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలలో ఆదాయాలు తగ్గడంతో పాటు, బంగారం ధరలు రికార్డు స్థాయిలకు చేరుకోవడంతో బంగారానికి డిమాండ్‌ తగ్గుతోందని తెలిపింది. ఈ ఏడాది బంగారం డిమాండ్‌ గతేడాదితో పోల్చుకుంటే 8 శాతం పడిపోయి 700 టన్నులకు చేరుకుందని, ఇది 2016 తర్వాత కనిష్ఠ స్థాయి అని డబ్యూజీసీ ఇండియా ఆపరేషన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ సోమసుందరమ్‌ పీఆర్‌ అన్నారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో బంగారం వినియోగం గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే భారీగా తగ్గి 123.9 టన్నులుగా నమోదైంది.  ఇండియా మార్కెట్‌లో బంగారం ధరలు 2019లో అంతర్జాతీయంగా ఉన్న ధర కంటే 17 శాతం పెరిగాయి. డిమాండ్‌ మందగించడంతో బంగారం దిగుమతులు తగ్గాయని, ఇది ద్రవ్యలోటును తగ్గించి రూపీ బలపడడంలో సహాయపడిందని విశ్లేషకులు తెలిపారు. 
   ‘అధిక ధరలతో పాటు గ్రామిణ ప్రాంతాలలో సెంటిమెంట్‌ బలహీనపడడంతో బంగారం డిమాండ్‌ ప్రభావితమయ్యింది’ అని  సోమసుందరమ్‌ అని​అన్నారు. అధికంగా కురిసిన వానలు పంటలను నాశనం చేశాయని అన్నారు  ఇండియాలో బంగారానికి డిమాండ్‌ మూడొంతులలో రెండొంతులు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుంది. గత 25 ఏళ్ల కాలంలో జూన్‌-సెప్టెంబర్‌ సీజన్‌లో వానలు అధికంగా పడ్డాయి. ఇది అక్టోబర్‌లోనూ కొనసాగింది. ఫలితంగా సిద్ధంగా ఉన్న వేసవి కాల పంటలయిన పత్తి, సోయాబీన్‌, చిరుధాన్యలు నాశనమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర జీవితకాల గరిష్ఠమైన రూ. 39,885 స్థాయికి చేరుకుంది. మొత్తంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటు, రూపీ క్షీణించడంతో ఈ ఏడాదిలో బంగారం ధరలు 22 శాతం మేర పెరిగాయి.  దేశీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటు, దిగుమతి సుంకాలు అధికంగా ఉండడంతో బంగారం డిమాండ్‌ జులై-సెప్టెంబర్‌లో తగ్గిందని డబ్యూజీసీ పేర్కొంది. ఈ ఏడాది జులై మొదటి వారంలో ఇండియా బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. 


WGC

You may be interested

నిఫ్టీలో తక్కువ వెయిటేజీ ఉ‍న్న వాటిపై ఫోకస్‌

Wednesday 6th November 2019

నిఫ్టీ-50 సూచీలో ఉన్న 50 స్టాక్స్‌లో తక్కువ వెయిటేజీ కలిగిన స్టాక్స్‌పై మ్యూచువల్‌ ఫండ్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో దృష్టి పెట్టినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే నిఫ్టీలోని 17 స్టా‍క్స్‌లో దేశీయ ఇనిస్ట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (డీఐఐలు) సెప్టెంబర్‌ క్వార్టర్లో కనీసం ఒక శాతం అంతకంటే ఎక్కువే తమ వాటాను పెంచుకున్నారు. వీటిల్లో 14 స్టాక్స్‌ నిఫ్టీ రాబడుల కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే నిఫ్టీలో అధిక వెయిటేజీ  స్టాక్స్‌

ఏడురోజుల లాభాలకు బ్రేక్‌

Tuesday 5th November 2019

54 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 11900 పైన ముగిసిన నిఫ్టీ ఫార్మా, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు  మార్కెట్‌ ఏడురోజుల లాభాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్వల్పంగా నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 54 పాయింట్లను కోల్పోయి 40,248.23 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 11,917 వద్ద స్థిరపడింది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

Most from this category