News


పసిడి పరుగులు కొనసాగేనా?!

Monday 14th October 2019
Markets_main1571051090.png-28875

ట్రేడ్‌వార్‌ ముగింపుతో బుల్స్‌కు పగ్గాలు
దీర్ఘకాలానికి పాజిటివ్‌ అంటున్న నిపుణులు
అంతర్జాతీయ మందగమనం, ట్రేడ్‌వార్‌ భయాలతో ఇటీవల కాలంలో బంగారం అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో మంచి ర్యాలీ చేసింది. ఒక దశలో పసిడి అంతర్జాతీయ మార్కెట్లో 1600 డాలర్లకు చేరవచ్చని నిపుణులు అంచనాలు వేశారు. అయితే ఇటీవల కాలంలో పసిడి ధర 1500 డాలర్ల జోన్‌లో కన్సాలిడేట్‌ అవుతోంది. ట్రేడ్‌వార్‌పై చైనా, యూఎస్‌ మధ్య ఆశావహ వాతావరణం ఏర్పడుతుండడంతో ఇకపై ఈక్విటీల జోరు మొదలవుతుందన్న అంచనాలు పసిడి పరుగును కట్టడి చేసే ఛాన్సులున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ట్రేడ్‌వార్‌ ముగింపునకు శాశ్వత పరిష్కారం లభించకపోవడం, అంతర్జాతీయంగా పెరుగుతున్న రిస్కులు.. సురక్షిత పెట్టుబడి సాధనాలకు అనుకూలంగా మారతాయని, అందువల్ల బంగారం ధర కన్సాలిడేషన్‌ అనంతరం తిరిగి పుంజుకుంటుందని ఎక్కువమంది అంచనా. స్వల్పకాలానికి కొంత ఒడిదుడుకులున్నా, 2020 వరకు బంగారంలో బుల్‌రన్‌ కొనసాగవచ్చని భావిస్తున్నారు. 

టెక్నికల్స్‌
యూఎస్‌, చైనాల మధ్య కుదిరిన ట్రేడ్‌ ఒప్పందం పాక్షికమైనదే కావడంతో ఈక్విటీల్లో జోరు క్రమంగా తగ్గుతోంది. పైగా బ్రెగ్జిట్‌పై తలెత్తుతున్న ప్రశ్నలు, సిరియా- టర్కీ సంక్షోభం లాంటివి అంతర్జాతీయ ఎకానమీ మనుగడపై నీలినీడలు కమ్మేలా చేస్తున్నాయి. అందువల్ల పెట్టుబడిదారులు తిరిగి బంగారంపైనే నమ్మకం పెడతారని భావిస్తున్నారు. సాంకేతికాంశాలు పరిశీలిస్తే బంగారం ధర ఇటీవలే వాలు రేఖ మద్దతును 1513 డాలర్ల వద్ద కోల్పోయింది. దీంతో స్వల్పకాలానికి నెగిటివ్‌జోన్‌లోకి మరలింది. దిగువన 1455 డాలర్లకు అటుఇటుగా పసిడికి మద్దతు దొరకవచ్చు. దీనికి దిగువన 1380 డాలర్ల వద్ద బలమైన మద్దతు ఉంటుంది. ఈ స్థాయికి కుపైన బంగారం ధర కదలాడినంత కాలం బుల్లిష్‌ ధోరణే ఉంటుందని టెక్నికల్స్‌ చెబుతున్నాయి. పైన 1522 1555 డాలర్ల వద్ద నిరోధం ఉంటుంది. డెరివేటివ్స్‌ మార్కెట్లో షార్ట్‌ పొజిషన్లు ఎక్కువగా ఉండడం స్వల్పకాలానికి బుల్స్‌ను వెనక్కులాగవచ్చు.

దేశీయ మార్కెట్లో 39-41వేల రూపాయల మధ్య బంగారానికి గట్టి నిరోధం ఉంటుంది. 38వేల రూపాయల వద్ద మద్దతు లబించవచ్చు. You may be interested

నెలలో భారీగా నష్టపోయిన షేర్లు

Tuesday 15th October 2019

కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ ఈక్విటీ మార్కెట్లు భారీ ర్యాలీ చేశాయి. మార్కెట్లో సెంటిమెంట్‌ కూడా కుదుటపడింది. కానీ, గత నెల 20 నుంచి చూస్తే బీఎస్‌ఈ 500 సూచీలోని 121 ‍స్టాక్స్‌ నెల రోజుల్లోనే ఏకంగా 10 శాతం నుంచి 50 శాతం మధ్య నష్టపోయాయి. బాగా పడిపోయి, చౌక ధరల్లో ఉన్న

చివరి అరగంటలో అమ్మకాలు.. అయినా లాభాల ముగింపే..!

Monday 14th October 2019

చివరి అరగంటలో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్ని కోల్పోయి పరిమిత లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 87.39  పాయింట్ల లాభంతో 38,214.47 వద్ద, నిఫ్టీ 36.20 పాయింట్లు పెరిగి 11,341.20 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా రెండో రోజూ లాభాల ముగింపు. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, అంతర్జాతీయంగా మడిచమురు ధరలు తగ్గముఖం పట్టడం, నేడు వెల్లడైన ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌ అంచనాలకు

Most from this category