News


1500డాలర్ల దిగువకు పసిడి

Tuesday 29th October 2019
Markets_main1572329336.png-29201

అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్న తరుణంలో అంతర్జాతీయం మార్కెట్లో పసిడి ధరలు 1500డాలర్ల దిగువకు చేరుకున్నాయి. ఆసియాలో మంగళవారం ఉదయం గం.11:00లకు ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల నష్టంతో 1,494 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అతి తొందరలోనే బీజింగ్, వాషింగ్టన్ మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని ట్రంప్ తెలపడంతో అమెరికా చైనాల మధ్య జరుగుతున్న 16నెలల సుధీర్ఘ వాణిజ్య యు‍ద్ధానికి ముగింపు పడవచ్చనే ఆశావహ అంచనాలతో సోమవారం అమెరికా మార్కెట్లు ఆల్‌టైం హైకి తాకగా, నేడు ఆసియా మార్కెట్లు 3నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు రిస్క్‌-అసెట్‌ పెట్టుబడులైన ఈక్వీటీ మార్కెట్లలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల డిమాండ్‌ తగ్గింది. వాణిజ్య చర్చలపై సానుకూల సంకేతాలు వెలువబడిన నేపథ్యంలో పసిడి నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో 9.50డాలర్లు నష్టపోయి 1,495.80 డాలర్ల వద్ద స్థిరపడింది. 

ఫెడ్‌నిర్ణయం కోసం ఎదురుచూపులు

పసిడి ఇన్వెస్టర్లు ఇప్పుడు వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. నేటి రాత్రి అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ ద్రవ్యపరపతి సమావేశం ప్రారంభం కానుంది. రేపు వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ ఏడాదిలో మూడోసారి వడ్డీరేట్ల తగ్గింపు ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వడ్డీరేట్ల తగ్గింపు ఉంటే, లేదా యథావిధిగా ఉంచినట్లైతే పసిడికి తిరిగి కొనుగోళ్ల మద్దతు లభించవచ్చని పసిడి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే విశ్లేషకులు ఎల్లుండి(గురువారం) జరిగే బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పాలసీ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంపై కూడా ఇన్వెస్టర్లు దృష్టినిలిపారు. 

దేశీయంగా రూ.38000 దిగువకు:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పతన ప్రభావంతో దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ధర నష్టాల బాట పట్టింది. వరుసగా రెండోరోజూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.40లు నష్టపోయి రూ.37882.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం నెల గరిష్టం నుంచి పసిడి ధర రూ.2,100లు నష్టపోయింది. 



You may be interested

పలు మిడ్‌క్యాప్స్‌లో ఎంఏసీడీ బుల్లిష్‌ సంకేతాలు

Tuesday 29th October 2019

మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు

టాటామోటర్స్‌ టార్గెట్‌ పెంచిన బ్రోకరేజ్‌లు

Tuesday 29th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికంలో మంచి ప్రదర్శన చూపడంతో బ్రోకరేజ్‌లు టాటామోటర్స్‌ షేరు టార్గెట్‌ను పెంచాయి. అయితే కొందరు నిపుణులు మాత్రం కంపెనీ ఫలితాల్లో ఇంకా మెరుగుదల రావాల్సిఉందని అభిప్రాయపడ్డారు.  - కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను  రూ. 190 నుంచి 200కు పెంచింది.  - సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ను రూ. 120 నుంచి రూ. 190కు పెంచింది.  - ఎడెల్‌వీజ్‌: హోల్డ్‌ రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ను రూ. 134

Most from this category