News


3-వారాల గరిష్టానికి పసిడి

Wednesday 25th September 2019
Markets_main1569393260.png-28541

అమెరికాలో తలెత్తిన రాజకీయ వివాదంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర‍ 3వారాల గరిష్టాన్ని అందుకున్నాయి. తన రాజకీయ ప్రత్యర్థులకు నష్టం చేకూర్చేందుకు విదేశీ శక్తుల్ని వాడుకోవాలని ట్రంప్ ప్రయత్నించారని ఆ దేశ ప్రధాన ప్రతిపక్షమైన డెమాక్రటిక్ పార్టీ ఆరోపణలు చేసింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పలోసీ ప్రకటించారు. మరోవైపు అమెరికా-చైనా వాణిజ్య చర్చల సఫలంపై మేఘాలు కమ్ముకోవడంతో పసిడి ధర పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర 1,543.25 డాలర్ల గరిష్టాన్ని అందుకుని 1,540.20 డాలర్ల వద్ద ముగిసింది. నేటి ఆసియాలో కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో పసిడి క్రితం ముగింపు ధర(1,540.20)తో పోలిస్తే 2డాలర్ల స్వల్ప నష్టంతో 1,538డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈక్విటీ మార్కెట్లో అనిశ్చితి, డాలర్‌ క్షీణతతో పాటు బలహీనంగా నమోదైన అమెరికా కన్జూ‍్యమర్‌ కాన్ఫిడెంట్‌ గణాంకాలు రానున్న రోజుల్లో పసిడికి మద్దతినిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
దేశీయంగా మళ్లీ రూ.38000ల పైకి:- 
దేశీయ మార్కెట్లో పసిడి ధర మళ్లీ రూ.38000 స్థాయిని అందుకున్నాయి. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.15ల స్వల్ప నష్టంతో రూ.38094.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచమార్కెట్లో పసిడి ధర 3వారాల గరిష్టానికి చేరుకోవడంతో పాటు డాలర్‌ మారక విలువలో రూపాయి 7 పైసలు బలహీనపడంతో నిన్నరాత్రి ఎంసీక్స్‌ మార్కెట్లో రూ.124లు లాభంతో రూ.38,108 వద్ద స్థిరపడింది. 



You may be interested

అంతర్జాతీయ బ్రోకరేజిల టాప్‌ సిఫార్సులు!

Wednesday 25th September 2019

వివిధ అంతర్జాతీయ బ్రోకరేజిల టాప్‌ సిఫార్సులు: బ్రోకరేజీ: సీఎల్‌ఎస్‌ఏ సీఎల్‌ఎస్‌ఏ , వరుణ్‌ బెవరేజస్‌ స్టాక్స్‌పై ‘బై’ కాల్‌నిస్తూ, షేరు టార్గెట్‌ ధరను రూ. 860 కి పెంచింది. వరుణ్‌ బెవరేజస్‌, తను విస్తరించిన భూభాగంలో మార్కెట్‌ లాభాలను పొందేందుకు ప్రయత్నిస్తుందని ఈ బ్రోకరేజీ అంచనావేసింది. ఈ కంపెనీ కన్సోలిడేషన్‌ దశ ముగిసిందని, కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ పారామితులు మెరుగుపడనున్నాయని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ మేనేజెమెంట్‌ రిటర్న్‌ నిష్పత్తులపై దృష్ఠి పెట్టనుందని ఈ

రిలయన్స్‌ చేతికి బజోడాట్‌ఏఐ

Wednesday 25th September 2019

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు  చెందిన అనుబంధ కంపెనీ హాప్‌టిక్‌, ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కన్వర్జేషనల్‌ కామర్స్‌ స్టార్టప్‌, బజోడాట్‌ఏఐను కొనుగోలు చేసింది. ఈ స్టార్టప్‌ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను హాప్టిక్‌ కంపెనీ వెల్లడించలేదు. ఈ స్టార్టప్‌ కొనుగోలుతో మరింత మెరుగైన వాయిస్‌, చాట్‌ కామర్స్‌ సొల్యూషన్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అందజేయగలమని హాప్టిక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్వపన్‌ రాజ్‌దేవ్‌ వెల్లడించారు. శామ్‌సంగ్‌, కేఎఫ్‌సీ, కోక-కోలా, ఓయో

Most from this category