News


బంగారం వెల్లడికి ఎటువంటి పథకం లేదు

Friday 1st November 2019
Markets_main1572578856.png-29268

  • కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వం బంగారానికి సంబంధించి ఎటువంటి క్షమాభిక్ష పథకాన్ని పరిశీలించడం లేదని కేంద్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి. లెక్కలు చూపని బంగారాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఓ స్వచ్చంద వెల్లడి పథకాన్ని త్వరలో కేంద్రం తీసుకురానుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఈ తరహా పథకం ఆదాయపన్ను శాఖ పరిశీలనలో లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్‌ ప్రక్రియ ఆరంభమైందని, సాధారణంగా బడ్జెట్‌ ప్రక్రియకు ముందు ఈ తరహా వదంతులు రావడం సహజమేనని పేర్కొన్నాయి. ఓ పరిమితికి మించి లెక్కలు చూపని బంగారం కలిగి ఉన్న వారు స్వచ్చందంగా వెల్లడించి ప్రభుత్వం నిర్దేశించిన పన్ను చెల్లించడం ద్వారా చట్టబద్ధం చేసుకోవచ్చని, ఇందు కోసం పథకాన్ని తీసుకురానుందంటూ మీడియాలో కథనాలు వచ్చిన విషయం గమనార్హం. 



You may be interested

చైనాలో 5జీ సేవలు షురూ

Friday 1st November 2019

సర్వీసులు ప్రారంభించిన 3 టెల్కోలు బీజింగ్‌: టెక్నాలజీ వినియోగంలో అమెరికాను అధిగమించే క్రమంలో చైనా తాజాగా 5జీ టెలికం సేవలు ప్రారంభించింది. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు గురువారం ఈ సర్వీసులు ప్రారంభించాయి. బీజింగ్‌, షాంఘై తదితర 50 నగరాల్లో తమ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని చైనా మొబైల్‌ సంస్థ వెల్లడించింది. ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి (18 డాలర్లు) ప్రారంభమవుతాయని పేర్కొంది. అటు పోటీ సంస్థలైన

వచ్చే 18 నెలలూ మంచి ర్యాలీ: సంజీవ్‌ భాసిన్‌

Friday 1st November 2019

భారీ ర్యాలీకి ఆరంభంలో మన మార్కెట్‌ ఉందన్నారు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, పెట్టుబడులకు మంచి అవకాశంగా పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఈ మేరకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.   ‘‘నేను చెప్పిన విధంగానే ఈ 12 వారాల్లో (నవంబర్‌ నుంచి) మార్కెట్లో మంచి పెరుగుదల ఉంటుంది. సెన్సెక్స్‌ ఇప్పటికే నూతన గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా నూతన గరిష్టాలకు వెళ్లడం

Most from this category