News


మళ్లీ రూ.38000 పైకి పసిడి

Tuesday 19th November 2019
Markets_main1574138722.png-29698

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు మళ్లీ డిమాండ్‌ పెరిగింది. డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్‌ ధర మళ్లీ రూ.38000 అందుకుంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై మరోసారి అనుమానాలు రేకెత్తడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండు రోజుల్లో(సోమ, మంగళ)13పైసలు బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్లు పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతుండటం తదితర అంశాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా నిన్నరాత్రి ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్‌ ధర రూ.225లు బలపడి రూ.38229 వద్ద ముగిసింది. పసిడి ధర మళ్లీ రూ.38లపైకి చేరిన నేపథ్యంలో నేడు స్వల్పంగా లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఉదయం గం.10:00లకు నిన్నముగింపు(రూ.38229) ధరతో పోలిస్తే రూ.59ల నష్టంతో రూ.38170.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
అంతర్జాతీయంగా వారంరోజుల గరిష్టానికి:-
అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై మరోసారి అనుమానాలు రేకెత్తడంతో పసిడి ధర వారం గరిష్టానికి చేరుకుంది. ఆసియాలో మంగళవారం ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల లాభంతో 1,475 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనాపై విధించిన సుంకాలపై ఎలాంటి తగ్గింపు ఒప్పందం ఉండదని ట్రంప్‌ వ్యాఖ్యలతో వాణిజ్య ఒప్పందం చర్చల సఫలంపై అనుమానాలు రేకెత్తాయి. సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడి భావించే పసిడి డిమాండ్‌ పెరిగింది. అదే విధంగా పసిడికి వ్యతిరేకంగా ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ సైతం రెండు వారాల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం సెంటిమెంట్‌ను బలపరిచింది.  ఈ వాణజ్య చర్చలపై మరింత స్పష్టత కోసం ఎదురుచూపులతో నేడు ఆసియా మార్కెట్లు స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి. గత పాలసీ సమావేశాల మినిట్స్‌ మరో రెండు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ వైట్‌ హౌస్‌లో సమావేశం అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధి, ఉద్యోగిత, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించినట్లు అధికారి వర్గాలు ప్రకటించాయి. ఇక నిన్నరాత్రి అమెరికాలో ట్రెజరీ ఈల్డ్‌ పతనం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత కారణంగా అక్కడి మార్కెట్లో పసిడి ధర 3.50డాలర్లు పెరిగి 1,472డాలర్ల వద్ద ముగిసింది. 



You may be interested

మారుతీ డీజిల్‌ కార్లకు భారీ డిమాండ్‌!

Tuesday 19th November 2019

డిస్కౌంట్లు, వారెంటీ కారణమంటున్న నిపుణులు మారుతీ సుజుకీ డీజిల్‌ కార్లకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. ఏప్రిల్‌ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానుండడంతో పలు డీజిల్‌ మోడళ్ల ఉత్పత్తిని మారుతీ గతంలో తగ్గించింది. తాజా డిమాండ్‌తో కంపెనీ కొన్ని డీజిల్‌ వేరియంట్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. బీఎస్‌ 6 నిబంధనలకు అనుగుణంగా కొత్త కార్లను తయారు చేసే ముందు ఉన్న సరుకును విక్రయించేందుకు మారుతీ పలు డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించింది.

పడిపోయిన రూపీ

Tuesday 19th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్లో 7 పైసలు బలహీనపడి 71.91 వద్ద ప్రారంభమైంది. కాగా విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగడంతో పాటు, డాలర్‌ బలపడడంతో  గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 71.84 వద్ద నెగిటివ్‌లో ముగిసింది. యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం నెమ్మదించడంతో పాటు, యుఎస్‌ చమురు నిల్వలు పెరగడంతో గత కొన్ని సెషన్‌ల నుంచి చమురు ధరలు నష్టాల్లో

Most from this category