News


2019: పసిడి లాభాల కాంతులు

Saturday 28th December 2019
Markets_main1577531057.png-30500

ఈ ఏడాది పసిడి ఇన్వెస్టర్లకు మంచి లాభాల్ని పంఛింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రికత్తలు, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితిలతో పాటు ఇతర భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపు తదితర కారణాలు పసిడి ఫ్యూచర్లను పరుగులు పెట్టించాయి. ఫలితంగా గడిచిన ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ 2019లో దాదాపు పసిడి 13.50శాతం పెరిగింది.
అగ్ర రాజ్యాల వాణిజ్య యుద్ధం:- 
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఈ ఏడాది పసిడి ర్యాలీకి కీలకమైంది. అమెరికాలోకి దిగుమతయ్యే చైనా ఉత్పత్తులపై పెద్ద ఎత్తున టారీఫ్‌ల విధిస్తున్నట్లు ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. చైనా సైతం తమ దేశంలోకి దిగుమతయ్యే అమెరికా వాణిజ్య వస్తువులపై టారీఫ్‌లను విధించింది. అనంతరం వాణిజ్య ఉద్రిక్తత నివారణకు ఇరుదేశాలు మధ్య పలు చర్చలు జరిగినప్పటికీ విజయవంతం కాలేకపోయాయి. వాణిజ్య యుద్దాన్ని ట్రంప్‌ తన రాజకీయ అవసరాలకు వినియోగించుకోవడంతో చర్చలు సఫలం కాలేకపోయాయి. అయితే ఇటీవల  వాణిజ్యయుద్ధానికి ముగింపు పలుకుతూ తయారైన ట్రేడ్‌డీల్‌ తొలిదశ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు యూఎస్‌, చైనా తయారవుతున్నాయి. ఈమేరకు చైనా అధ్యక్షుడితో చర్చల అనంతరం అమెరికా అధ‍్యక్షుడు ట్రంప్‌ ఒక ప్రకటన చేశారు. ఈ దశలో కూడా పసిడి పెరగడం విశేషం.

ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల తగ్గింపు:-
అమెరికన్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల తగ్గింపు పసిడి ఫ్యూచర్ల ర్యాలీకి కలిసొచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, చైనాతో వాణిజ్య యుద్ధం, ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యాలు తదితర అంశాల దృష్టిలో ఉంచుకోని కీలక వడ్డీరేట్లను ఏడాదిలో ఏకంగా 3సార్లు తగ్గించింది. పైగా తగ్గించిన ప్రతిసారి భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థ నీరసిస్తే మరింత వేగంగా రేట్ల కోత ఉండవచ్చని ఫెడ్‌ చీఫ్‌ పావెల్‌ సంకేతాలతో పసిడికి వ్యతిరేక దిశలో ట్రేడయ్యే డాలర్‌ నీరసించింది. 

ప్రపంచమార్కెట్లో ....పసిడి

  • సెప్టెంబర్‌ 4 తేదిన 1566డాలర్ల వద్ద ఈ ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. 
  • జూన్‌ 21 తేదిన 1,276.15 డాలర్ల వద్ద ఏడాది కనిష్టాన్ని నమోదు చేసింది. 
  • జూన్‌ 20 తేదీన ఒక్కరోజులో అత్యధికంగా 48.8 డాలర్లు(3.54శాతం) నష్టపోయింది.
  • జనవరి 20 తేదిన ఒక్కరోజులో అత్యధికంగా 31.75డాలర్లు(2.41 శాతం) లాభపడింది.

దేశీయ బులియన్‌ మార్కెట్లో ఈ ఏడాది పసిడి గమనం:- 
అంతర్జాతీయ పసిడి ఫ్యూచర్ల కంటే ఈ ఏడాది దేశీయ పసిడి ఫ్యూచర్లు ఎక్కువగానే ర్యాలీ చేశాయి. ఈ ఏడాదిలో ఏకంగా 20శాతం లాభాల్ని  లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచాయి. ఇదే సమయంలో నిఫ్టీ, సెన్సెక్స్‌లు 12శాతం మాత్రమే ర్యాలీ చేయడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీతో పాటుగా ఈ ఏడాది డాలర్‌ మారకంలో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ పసిడి ఫ్యూచర్లకు కలిసొచ్చింది. ఈ క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో సెప్టెంబర్‌ 04 తేదీన రూ.39,885 రికార్డు గరిష్టస్థాయిని తాకింది. అయితే పసిడి దిగుమతులపై ప్రభుత్వం సుంకాలను పెంచడం, జీఎస్‌టీని విధించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీ కారణంగా స్పాట్‌ గోల్డ్‌కు కొంత డిమాండ్‌ తగ్గిందని బులియన్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. You may be interested

బ్యాంకు రుణాలు మాకొద్దు..!?

Monday 30th December 2019

దేశంలో 50 కార్పొరేట్‌ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (2019 ఏప్రిల్‌-సెప్టెంబర్‌) మొత్తం మీద రూ.59,600 కోట్ల మేర రుణభారాన్ని తగ్గించుకున్నాయి. తమ బ్యాలన్స్‌షీట్లలో రుణ భారాన్ని తగ్గించుకోవాలన్న కార్యాచరణలో భాగమే ఇది. ఇది బ్యాంకుల రుణాల వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని, దేశీయ బ్యాంకుల నుంచి కార్పొరేట్ల రుణ సమీకరణ తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇవే కంపెనీలు క్రితం ఆర్థిక సంవత్సరం 2018-19లోనూ రూ.43,000

బ్యాంకింగ్‌ అధికారులపై విజిలెన్స్‌ కేసులు క్లియర్‌ చేయాలంటూ ఆదేశాలు

Saturday 28th December 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశాలు న్యూఢిల్లీ: బ్యాంకు అధికారులపై నమోదైన పెండింగ్‌ విజిలెన్స్‌ కేసులను క్లియర్‌ చేయమంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అవకతవకలకు పాల్పడిన అభియోగాలపై పెండింగ్‌లో ఉన్న అధికారుల కేసులను క్లియర్‌ చేయమంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశించారు. కాగా.. జనవరి 1 నుంచీ కొన్ని ఎంపిక చేసిన చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(MDR)

Most from this category