News


తగ్గిన చమురు ధర

Thursday 27th June 2019
Markets_main1561609574.png-26605

గత సెషన్‌లో 2 శాతానికి పైగా పెరిగిన చమురు ధరలు గురువారం(జూన్‌ 27) ట్రేడింగ్‌ ప్రారంభంలో నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు 0.7శాతం తగ్గి బ్యారెల్‌కు 66.05 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.7శాతం నష్టపోయి 58.97 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ వారం చివరిలో జరగనున్న జీ 20 సమావేశంతో పాటు, ఒపెక్‌, నాన్‌ ఒపెక్‌ దేశాల సమావేశాలుండడంతో మదుపర్లు జాగ్రత్త వహించారు. అమెరికా నిల్వలు 25 లక్షల బ్యారెల్‌లు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తే అది 128 లక్షల బ్యారెల్‌ తగ్గడంతో బుధవారం చమురు ధరలు పెరిగాయి.



You may be interested

అమెరికా-చైనా మధ్య తాత్కాలిక సంధి

Thursday 27th June 2019

కీలకమైన జీ 20 సమ్మిట్‌ ముందు చైనా- అమెరికా దేశాల మధ్య తాత్కాలికంగా సంధి కుదిరిందని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌(ఎస్‌సీఎమ్‌పీ) రిపోర్ట్‌ చేసింది. ఫలితంగా 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా విధించనున్న సుంకాలు తాత్కాలికంగా నిలిచాయని తెలిపింది. ఈ  తాత్కలిక ఒప్పందాన్ని వాషిగ్టన్‌ కూడా ఒప్పుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధ్యక్షడు జిన్‌పింగ్‌తో శనివారం ఉదయం 11.30కు సమావేశం కానున్నారు. ‘ఈ వారం చివరిలో

69.26 వద్ద రూపీ ప్రారంభం

Thursday 27th June 2019

డాలర్‌ మారకంలో రూపీ గురువారం(జూన్‌ 27) ట్రేడింగ్‌లో 11 పైసలు బలహీనపడి 69.26 వద్ద ప్రారంభమైంది. దేశియ ఈక్విటీ మార్కెట్‌లో సానుకూలత వలన రూపీ గత సెషన్‌లో 21 పైసలు బలపడి 69.15 వద్ద ముగిసింది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి 90 శాతం దగ్గరగా ఉన్నామని అమెరికా వాణిజ్య సెక్రటరి అనడంతో గత సెషన్‌లో రూపీ బలపడింది. అంతేకాకుండా రాబోయే జీ20 సమ్మిట్‌లో ఈ ఒప్పందం ముందుకు

Most from this category