News


మెరుపులు తగ్గిన ధంతేరాస్‌

Saturday 26th October 2019
Markets_main1572063907.png-29152

  • దేశీయంగా అమ్మకాలు 40 శాతం డౌన్‌
  • అధిక పుత్తడి ధరే ఇందుకు కారణం 
  • చిన్న ఆభరణాలకే కస్టమర్ల మొగ్గు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ధంతేరాస్‌కు పుత్తడి మెరుపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 40 శాతం దాకా తగ్గాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెరిగిన పసిడి ధరకుతోడు కస్టమర్ల వ్యయాలు తగ్గడం ఇందుకు కారణమని వర్తకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2018 ధంతేరాస్‌తో పోలిస్తే ప్రస్తుత పుత్తడి ధర రూ.6,000 పైచిలుకు అధికంగా ఉంది. ధన త్రయోదశికి బంగారం, వెండి, లేదా విలువైన వస్తువులు కొనడం శుభ సూచకమని హిందువులు భావిస్తారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జువెల్లరీ షాపుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.39,900 ఉంది. 22 క్యారెట్ల ధర రూ.36,850 పలికింది. కిలో వెండి ధర రూ.50,600 ఉంది. 
నిరాశపర్చిన ధంతేరాస్‌...
ఈ సంవత్సరం ధన త్రయోదశికి సాయంత్రం వరకు రూ.2,500 కోట్ల విలువైన సుమారు 6,000 కిలోల పుత్తడి అమ్ముడైందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) అంచనా వేస్తోంది. గతేడాది రూ.5,500 కోట్ల విలువైన 17,000 కిలోల బంగారం విక్రయమైందని చెబుతోంది. వ్యాపారం 35-40 శాతం పడిపోయిందని సీఏఐటీ గోల్డ్‌, జువెల్లరీ కమిటీ చైర్మన్‌ పంకజ్‌ అరోరా వెల్లడించారు. గోల్డ్‌, సిల్వర్‌ ధరలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరగడమే అమ్మకాలు పడిపోవడానికి కారణమైంది. గత పదేళ్లలో అత్యధికంగా నిరాశపర్చిన ఏడాది ఇదేనని ఆయన చెప్పారు. పరిమాణం పరంగా 2018తో పోలిస్తే అమ్మకాలు 20 శాతం తగ్గొచ్చని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జువెల్లరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ పేర్కొన్నారు. 
మెరిసిన వెండి..
అధిక ధర కారణంగా ఈసారి సెంటిమెంట్‌ పడిపోయిందని గోల్డ్‌ రిఫైనింగ్‌ సంస్థ ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా ఎండీ రాజేశ్‌ ఖోస్లా తెలిపారు. ప్రస్తుతం ఉన్న గోల్డ్‌ ధర వినియోగదార్లకు చాలా అధికమని ఆయన అభప్రాయపడ్డారు. దీంతో వెండి నాణేల వైపు కస్టమర్లు మొగ్గు చూపారని ఆయన చెప్పారు. సిల్వర్‌ కాయిన్స్‌ విక్రయాలు 2018తో పోలిస్తే 15 శాతం పెరిగాయని అన్నారు. గోల్డ్‌ కాయిన్స్‌ అమ్మకాలు తగ్గాయని వివరించారు. వివాహాల సీజన్‌ తోడవడంతో వెండి వస్తువుల అమ్మకాలు పెరిగాయని శ్రీ స్వర్ణ జువెల్లర్స్‌ ఎండీ ప్రియ మాధవి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. కాలికి వేసుకునే కడియాలకు మళ్లీ డిమాండ్‌ పెరగడం విశేషమని చెప్పారు. విదేశాల నుంచి వీటికి ఆర్డర్లు వచ్చాయని వివరించారు.
చిన్న ఆభరణాలకే..
అన్ని షోరూంలలోనూ అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయని కళ్యాణ్‌ జువెల్లర్స్‌ సీఎండీ టి.ఎస్‌.కళ్యాణరామన్‌ తెలిపారు. స్తబ్దుగా ఉన్న మార్కెట్లో ధంతేరాస్‌ రాకతో పరిస్థితిలో మార్పు కనపడిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సి్‌ల్‌ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈసారి తక్కువ విలువ ఉన్న ఆభరణాల వైపు అధిక మంది ఆసక్తి చూపారని జీజేసీ అంటోంది. 60-70 శాతం చిన్న ఆభరణాల అమ్మకాలేనని శారీనికేతన్‌ గోల్డ్‌ విభాగం ఇన్‌చార్జ్‌ గుల్లపూడి నాగ కిరణ్‌ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్‌తో ముడిపడి 30 శాతం పైగా అమ్మకాలు నమోదయ్యాయని వివరించారు. మొత్తంగా పుత్తడి అమ్మకాలు 40 శాతం పడిపోయాయని చెప్పారు. You may be interested

కేంద్రం వద్దకు వొడాఫోన్‌-ఐడియా

Saturday 26th October 2019

న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజుల బకాయిలకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రతికూల తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రాన్ని ఆశ్రయించాలని టెలికం సంస్థ వొడాఫోన్‌-ఐడియా నిర్ణయించుకుంది. వడ్డీలు, పెనాల్టీలు మొదలైనవి తొలగించడం సహా ఊరట చర్యలు తీసుకోవాలని టెలికం శాఖను (డాట్‌) కోరాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. డాట్ నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే టెల్కోలు లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం ఫీజులు కట్టాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా

ఆరు రెట్లు పెరిగిన ఎస్‌బీఐ లాభం

Saturday 26th October 2019

రూ.3,375 కోట్లకు ఎగసిన నికర లాభం  కలసివచ్చిన బీమా వెంచర్‌లో వాటా విక్రయం  మెరుగుపడిన రుణ నాణ్యత  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో దాదాపు ఆరు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.576 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.3,375 కోట్లకు పెరిగిందని ఎస్‌బీఐ తెలిపింది. తమ అనుబంధ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4.5

Most from this category