News


క్రూడ్‌ ధరల తగ్గుదల భారత్‌కు మంచిదే!

Tuesday 10th March 2020
Markets_main1583836791.png-32393

  కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తితో ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లు పతనమవుతుండడంతో ఆయా దేశాలు ఆర్థిక వ్యస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి.ఫలితంగా చాలా ఉత్పత్తులకు డిమాండ్‌లేక ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌కు డిమాండ్‌ తక్కువగా ఉండి ఉత్పత్తి పెరగడంతో ధరలు దిగివస్తున్నాయి. ఈ పరిమాణం భారత ఆర్థిక వ్యవస్థకు, స్టాక్‌ మార్కెట్‌కు అనుకూలించే అంశమని నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్‌, క్రూడ్‌ ఆయిల్‌ రెండు ఒకటి పెరిగితే మరోకటి తగ్గుతూ  వ్యతిరేఖ దిశలో ఉంటాయి. గత 20 సంవత్సరాల్లో ఎనిమిది సార్లు క్రూడ్‌ ధరలు 20 శాతానికిపైగా పడిపోయినప్పుడు ఆతర్వాత ఆరు నెలల్లో భారత స్టాక్‌ మార్కెట్‌ రిటన్స్‌ సగటున 19 శాతం నమోదయ్యాయి. 

భారత్‌కు వరం
ప్రస్తుతం క్రూడ్‌ఆయిల్‌ ధరలు పడిపోవడం భారత ప్రభుత్వాని ఒక వరం లాంటిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలో వినియోగించే మొత్తంక్రూడ్‌లో దాదాపు 85 శాతం క్రూడ్‌ఆయిల్‌ను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాము. క్రూడ్‌ ధర తగ్గడం వల్ల వివిధ రంగాలకు ప్రోత్సాహాలు అందడంతోపాటు ద్రవ్యలోటును పూడ్చడానికి మంచి అవకాశం. అంతేకాకుండా ఆయిల్‌ మార్కెటింగ్‌, పెయింట్‌, టైర్‌, స్పెషాలిటీ కెమికల్స్‌, ప్లాస్టిక్‌ పైపింగ్‌, ఏవియేషన్‌, సిమెంట్‌ వంటి రంగాల్లో క్రూడ్‌ఆయిల్‌ను ముడి పదార్థాలుగా వాడడం వల్ల ఈ రంగాలకు క్రూడ్‌ ధరలు తగ్గడం వల్ల లాభం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ద్రవ్యలోటు తగ్గించవచ్చు
తగ్గిన క్రూడ్‌ ధరలు ఇంకొంత కాలం ఇలానే స్థిరంగా సాగితే వంటనూనె సబ్సిడీలు తగ్గించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం భారత్‌లో ఉన్న  ద్రవ్యలోటును తగ్గించుకునేంకు అవకాశం ఉంటుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు తరుణ్‌లోకియా చెబుతున్నారు. 1991 జనవరి 17 తర్వాత క్రూడ్‌ ధరలు ఒకేవారంలో 32 శాతం తగ్గడం ఇదే మొదటిసారి. వార్షిక ప్రాతిపదికన  బ్యారెల్‌పై 10 డాలర్లు తగ్గుతూ వస్తే ప్రస్తుత ద్రవ్య లోటు 15 బిలియన్‌ డాలర్లు తగ్గి, 1.9 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని లోహియా అన్నారు. దీంతోపాటే వంటనూనెల సబ్సిడీలు 8.5 బిలియన్‌ డాలర్లు తగ్గవచ్చని, వాహనాల ఇంధనం ఒక లీటరుపన రూ.4.50 ఆదాయం వస్తుందని అన్నారు.

పాజిటివ్‌ ప్రభావం కొద్దిరోజులే
క్రూడ్‌ఆయిల్‌ సరఫరా అధికంగా ఉండడం డిమాండ్‌ తక్కువగా ఉండడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పడిపోయాయని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ అభిమన్యూ సోఫత్‌ వెల్లడించారు. క్రూడ్‌ ధరలు తగ్గడం వల్ల సెన్సెక్స్‌పై కొద్ది కాలం మాత్రమే పాజిటివ్‌ ప్రభావాన్ని చూపుతుందని అభిమన్యూ​అన్నారు.  కరోనా వైరస్‌ భయం పోయినప్పుడే గ్లోబల్‌ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి డిమాండ్‌ పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక క్రూడ్‌ ఉత్పత్తులను వినియోగించుకునే కంపెనీలైన క్యాస్ట్రోల్‌, ఎంఆర్‌ఎఫ్‌లు ఈ పరిస్థితుల వల్ల లాభాన్ని పొందుతాయని. ఎయిర్‌లైన్స్‌, రవాణా రంగాలు క్రూడ్‌ ధరలు పడిపోవడం వల్ల కొంత లబ్ధి పొందినప్పటికీ కరోనా వ్యాప్తి కొంత ఇబ్బంది పెట్టే అంశమని ఆయన పేర్కొన్నారు.

క్రూడ్‌ ధరలు పడిన ప్రతిసారి సెన్సెక్స్‌లో చోటు చేసుకున్న మార్పులు ఈ కింది విధంగా ఉన్నాయి

క్రమ సంఖ్య తేదీ బ్రెంట్‌(డాలర్లలో) ఒకనెలలో తగ్గిన %  తరువాతి 6 నెలల్లో సెన్సెక్స్‌ మార్పులు
 
1. 09-10-2001 21.74    
 
 -21.00   
 
   24.54
 
2. 21-03-2003  25.20     -20.90 
 
   29.19
 
3. 08-08-2008 115.11      -20.84   
 
   -40.06
 
4. 04-11-2008 60.28   
 
 -33.27    
 
    14.14
 
5. 26-12-2008 34.80     -30.32        53.78
6. 08-12-2014 67.02     -20.38      -5.68
7. 05-01-2015 54.40    -21.55 
 
  1.32
 
8. 24-08-2015     40.74   -21.91      -7.59
 
9. 11-01-2016 29.64   -20.24         11.29
10. 13-11-2018    64.18   -21.42  
 
   5.54
 
11. 09-03-2020 33.49     -36.78       ------ 


 You may be interested

నేడు నిఫ్టీకి 10,247 వద్ద సపోర్ట్‌!

Wednesday 11th March 2020

అటూఇటుగా ప్రపంచ మార్కెట్లు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 47 పాయింట్లు మైనస్‌  మంగళవారం యూఎస్‌ మార్కెట్లు హైజంప్‌ ప్రస్తుతం నేలచూపులో ఆసియా మార్కెట్లు నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 47 పాయింట్లు క్షీణించి 10,400 వద్ద ట్రేడవుతోంది. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 10,447 పాయింట్ల  వద్ద ముగిసింది.

10,100–9,850 స్థాయిలో కొనుగోళ్లు మంచివే: మజర్‌ మహమ్మద్‌

Tuesday 10th March 2020

ఇటీవల మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాల నేపథ్యంలో ఈక్విటీలతో పాటు పెట్టుబడి సాధనాలుగా భావించే క్రూడాయిల్‌, రూపీలుగా భారీ కూడా పతనాన్ని చూశాయి. టెక్నికల్‌ ఛార్ట్‌లు కొంత ఆందోళనలు కలిగిస్తున్నప్పటికీ..,  ధీర్ఘకాలిక ట్రెండ్‌ అనుకూలంగానే ఉన్నట్లు చతుర్వేది డాట్‌ ఇన్‌ సాంకేతిక నిపుణుడు మజర్‌ మహమ్మద్‌ అభిప్రాయపడ్డారు. ఒక ఆంగ్లఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రస్తుత మార్కెట్‌ తీరుపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  భారత మార్కెట్‌కు భారీ పతనాలు కొత్తేమీ కాదని, అయితే

Most from this category