News


మధ్యప్రాచ్య అనిశ్చితి..పెరిగిన చమురు

Friday 20th September 2019
Markets_main1568954146.png-28445

సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరిగాక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్‌లో చమురు లాభపడి ట్రేడవుతోంది. ఉదయం 9.37 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.54 శాతం పెరిగి బారెల్‌ 63.67 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.88 శాతం పెరిగి 58.70 వద్ద ట్రేడవుతున్నాయి. సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన డ్రోన్‌ దాడికి ఇరాన్‌ కారణంగా చూపుతూ, అమెరికా, మధ్యప్రాచ్యంలో సౌదీ నేతృత్వంలో యూరోపియన్‌ దేశాలతో కలిసి ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంకీర్ణం యెమెన్ హోడిడాకు ఉత్తరాన సైనిక చర్యను ప్రారంభించండంతో మధ్యప్రాచ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. గత వారంతంలో సౌదీ ముఖ్యమైన చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరగడంతో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది. చమురు ఉత్పత్తిని తిరిగి రోజుకు 12 లక్షల బారెల్స్‌కు నవంబర్‌ చివరినాటికి పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్‌ దాడికి ప్రధాన కారణం ఇరాన్‌ అని యుఎస్‌, సౌదీ అరేబియా ఇరుదేశాలు ఆరోపిస్తుండగా, ఇరాన్‌ ఈ ఆరోపణలను ఖండించింది. వీటితోపాటు యుఎస్‌లో ఇమెల్డా తుఫాను వలన కురుస్తున్న వర్షం కారణంగా ప్రధాన చమురు రిఫైనరీలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవలసి వచ్చింది. అంతేకాకుండా టెక్సాస్‌లో ఉన్న ప్రధాన చమురు పైప్‌లైన్‌లు, టెర్మినల్స్‌, షిప్‌ చానెల్‌లు కూడా క్లోజయ్యాయి. 



You may be interested

పన్ను రేట్ల కోత?

Friday 20th September 2019

నేడు జీఎస్‌టీ మండలి కీలక సమావేశం న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి 37వ కీలక సమావేశం శుక్రవారం గోవాలో జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో... పన్నులు తగ్గించాలని, తద్వారా వ్యవస్థలో డిమాండ్‌ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని పలు పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ కీలక జీఎస్‌టీ సమావేశం జరగనుంది. పన్నుల తగ్గింపుపై ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుందని కూడా సమాచారం. ఆర్థికశాఖ మంత్రి

యస్‌ బ్యాంక్‌లో 2 శాతం వాటా విక్రయించిన మోర్గాన్‌ క్రెడిట్స్‌

Friday 20th September 2019

ఆర్‌నామ్‌ ఎన్‌సీడీల చెల్లింపుల కోసం న్యూఢిల్లీ: యస్‌ బ్యాంక్‌లో ప్రమోటర్‌ సంస్థ, మోర్గాన్‌ క్రెడిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎమ్‌సీపీఎల్‌) 2.3 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఎన్‌సీడీలకు ముందుగానే చెల్లింపులు జరపడానికి, మరోవైపు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం యస్‌బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా తగ్గించుకునే ​క్రమంలో భాగంగా మోర్గాన్‌ క్రెడిట్స్‌ ఈ షేర్లను విక్రయించింది. యస్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓ రాణా కపూర్‌కు

Most from this category