News


తగ్గిన చమురు ధరలు

Tuesday 20th August 2019
Markets_main1566278551.png-27887

ముడి చమురు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతోంది. కానీ యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాల నేపథ్యంలో ఈ నష్టాలు పరిమితంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రెంట్‌ క్రూడ్‌ మంగళవారం 0.05 శాతం తగ్గి బ్యారెల్‌ 59.71 డాలర్లకు చేరుకుంది. కాగా గత సెషన్లో బ్రెంట్‌ క్రూడ్‌ 1.88 శాతం పెరిగింది. అదే విధంగా గత సెషన్లో 2.44 శాతం లాభపడిన డబ్యూటీఐ క్రూడ్‌ మంగళవారం 0.3 శాతం తగ్గి బ్యారెల్ 56.06 డాలర్లకు చేరుకుంది. 
   చైనా కంపెనీ హువావే టెక్నాలజీస్‌, యుఎస్ కంపెనీల నుంచి విడి భాగాలు కొనడానికి అనుమతించే పక్రియను పొడిగిస్తామని యుఎస్‌ తెలపడంతో  ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొంతమేర తగ్గాయని విశ్లేషకులు తెలిపారు. ఈ పొడిగింపు, వచ్చే నెలలో జరిగే యుఎస్-చైనా వాణిజ్య చర్చలకు సహాయపడుతుందని వీఎం మార్కెట్స్ మేనేజింగ్ భాగస్వామి స్టీఫెన్ ఇన్నెస్ ఒక నోట్‌లో తెలిపారు. ‘ చమురు ధరల పతనానికి యుఎస్-చైనా ట్రేడ్‌ వార్‌ ప్రధానంగా ఉంది. ఈ ట్రేడ్‌ వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెలుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ తగ్గుతోంది’ అని ఆయన అన్నారు. 
  కార్పొరేట్ రుణాల ఖర్చులు తగ్గడానికి సహాయపడే వడ్డీ రేటు సంస్కరణలను చైనా సెంట్రల్ బ్యాంక్ ఆవిష్కరించింది. చైనాతో పాటు జర్మనీ సంకీర్ణ ప్రభుత్వం బడ్జెట్ నిబంధనను తొలగించి, మాంద్యాన్ని ఎదుర్కోవటానికి కొత్త రుణాలు తీసుకుంటామని తెలిపింది. 
  యుఎస్‌ క్రూడ్‌​ ఆయిల్‌  జాబితా ఆగస్టు 16 వరకు గల వారంలో 19 లక్షల బారెల్స్కు  పడిపోయిందని రాయిటర్స్‌ విశ్లేషకులు తెలిపారు. కాగా అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ (ఏపీఐ) అధికారిక డేటాను మంగళవారం విడుదలచేయనుంది. విటితో పాటు ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) దేశాలు విడుదల చేసిన నివేదిక చమురు డిమాండ్ వృద్ధి అంచనాలపై ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఒపెక్‌ 2019 లో ప్రపంచ చమురు డిమాండ్ వృద్ధి అంచనాలను రోజుకు 40,000 బ్యారెల్స్ (బీపీడీ) తగ్గించి 11 లక్షల బీపిడీగా నిర్ణయించింది. ఇది 2020 లో చమురు మార్కెట్‌లో స్వల్ప మిగులును తెలియజేస్తోందని విశ్లేషకుల తెలిపారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం చమురు ధరలకు కొంత మద్ధతుగా ఉందని పరిశీలకులు తెలిపారు.



You may be interested

ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలు!

Tuesday 20th August 2019

విస్తరిస్తున్న ఈక్విటీ, బాండ్‌ఈల్డ్స్‌ అంతరాలు ప్రపంచంలోని ధనిక దేశాల్లో బాండ్‌ ఈల్డ్స్‌ అంతరం విస్తరిస్తున్న క్రమం ఆందోళన కలిగిస్తోందని ఎకనమిస్టులు చెబుతున్నారు. త్వరలో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఈక్విటీలు అల్లకల్లోలమవుతాయని హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో పూర్తి మాంద్యం వచ్చేందుకు అవకాశాలు మూడింట ఒకవంతుకు పెరిగాయని, గతేడాదితో పోలిస్తే మాంద్య భయాలు ఐదు రెట్లు అధికమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బాండ్స్‌ రాబడులకు, స్టాక్స్‌ రాబడులకు

జూలైలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు డౌన్‌

Tuesday 20th August 2019

11 శాతం తగ్గిన రిటైల్‌ అమ్మకాలు న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) రిటైల్‌ అమ్మకాలు జూలైలో గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా డిమాండ్‌ తగ్గిన నేపథ్యంలో గతనెల పీవీ విక్రయాలు 2,43,183 యూనిట్లుగా నిలిచాయి. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో అమ్ముడైన 2,74,772 యూనిట్లతో పోల్చితే 11 శాతం తగ్గుదల నమోదైంది. ద్విచక్ర వాహన విక్రయాలు జూలైలో 13,32,384 యూనిట్లు కాగా, 2018 ఏడాది

Most from this category