News


క్రూడ్‌ కేంద్రంపై దాడి..పెరిగిన చమురు

Monday 19th August 2019
Markets_main1566187674.png-27843

సౌదీ చమురు కేంద్రంపై యెమెన్ వేర్పాటువాదులు శనివారం దాడి చేయడంతో సోమవారం(అగష్టు 19) ట్రేడింగ్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయి. కానీ చమురు ధరల వృద్ధి తగ్గుదలను ఒపెక్ నివేదిక పేర్కొనడంతో, అంతర్జాతీయంగా చమురు డిమాండ్ ఆందోళనలు క్రూడ్‌ ఆయిల్‌ను వెంటాడుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.8 శాతం పెరిగి బ్యారెల్‌ 59.09 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.7 శాతం పెరిగి బ్యారెల్ 55.26 డాలర్లకు చేరుకున్నాయి. 
  తూర్పు సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రంపై శనివారం యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ డ్రోన్ దాడి చేయడంతో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడి వలన గ్యాస్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయని, కానీ చమురు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగలేదని సౌదీ ప్రభుత్వరంగ సంస్థ అరామ్‌కో తెలిపింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వలన చమురు ధరలకు మద్ధతు లభిస్తున్నప్పటికి ఆర్థిక మాంద్యం, చమురు డిమాండ్ వృద్ధిపై ఆందోళనలు చమురు ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నెలవారీ నివేదికలో భాగంగా, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) 2019 లో ప్రపంచ చమురు డిమాండ్ వృద్ధి అంచనాలను రోజుకు 40,000 బ్యారెల్స్ (బీపీడీ) తగ్గించి 11 లక్షల బీపిడీగా నిర్ణయించింది. ఇది 2020 లో చమురు మార్కెట్‌లో స్వల్ప మిగులును తెలియజేస్తోందని విశ్లేషకుల తెలిపారు. మరోవైపు యు.ఎస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ ఉన్నతాధికారులు ఆర్థిక వృద్ధి క్షీణించవచ్చనే ఆందోళనలను తోసిపుచ్చారు. చైనాతో వాణిజ్య యుద్ధం వలన అమెరికాకు ఎటువంటి నష్టం జరగలేదని ట్రంప్‌ పునరుద్ఘాటించడం గమనార్హం. అంతేకాకుండా ‘చైనా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోడానికి ఆత్రుతగా ఉందని కానీ నేను ఇంకా ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా లేను’ అని అన్నారు. 



You may be interested

71.17 వద్ద రూపీ ప్రారంభం

Monday 19th August 2019

రూపీ డాలర్‌మారకంలో సోమవారం స్వల్పంగా బలహీనపడి 71.17 వద్ద ప్రారంభమైంది. కాగా అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడడంతో పాటు దేశియ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 13 పైసలు బలపడి 71.14 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 71.47 వద్ద కనిష్ఠాన్ని తాకి తిరిగి పుంజుకోవడం గమనార్హం.

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 19th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌:- సంస్థ రుణాలపై స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది జూలై 31నాటికి సంస్థకు మొత్తం రూ. 4,970 కోట్ల రుణాలున్నట్లు తెలిపింది. గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌ సంస్థకు విక్రయంతో వచ్చిన నిధుల ద్వారా మొత్తం రుణాన్ని రూ.2400 కోట్లకు పరిమితం చేసుకోవాలని భావిస్తుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ప్రస్తుత పరిస్థితులో క్యూ1 ఫలితాలను అనుకున్న తేదికి విడుదల చేయలేమని ప్రకటించింది. అయితే

Most from this category