News


పతనాల తర్వాత పెరిగిన చమురు

Friday 16th August 2019
Markets_main1565928539.png-27796

యుఎస్‌ రిటైల్‌ అమ్మకాలు పెరగడంతో, అమెరికా ఆర్థిక మాంద్య ఆందోళనలు కొంత తగ్గాయి. ఫలితంగా వరుసగా రెండు సెషన్‌లలో నష్టపోయిన చమురు ధరలు శుక్రవారం తిరిగి కోలుకున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బ్యారెల్‌ 58.54 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్యూటీఐ క్రూడ్‌ 0.8 శాతం పెరిగి బ్యారెల్‌ 54.90 డాలర్లకు చేరుకుంది. కాగా గత రెండు సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 2.1 శాతం, 3 శాతం నష్టపోగా, డబ్యూటీఐ క్రూడ్‌ 1.4 శాతం, 3.3 శాతం చొప్పున నష్టపోయాయి. వినియోగదారులు, మోటర్‌ వాహనాల కొనుగోళ్లను తగ్గించుకున్నప్పటికి, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో జులై నెలలో యుఎస్ రిటైల్ అమ్మకాలు 0.7 శాతం పెరిగాయి. 
    2007 జూన్‌ తర్వాత ఏర్పడిన ఇన్వెర్టర్డ్‌ యుఎస్ ట్రెజరీ ఈల్డ్‌ కర్వ్‌, అక్కడి స్టాక్‌ మార్కెట్లు, చమురు మార్కెట్లలో అమ్మకాల ఒత్తిళ్లను తెలుపుతోందని విశ్లేషకులు తెలిపారు. ఇది యుఎస్‌ ఆర్థిక వ్యవస్థ మాంధ్యం వైపు కదులుతున్న విషయాన్ని వివరిస్తుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఉద్దేశించి చేసిన వరుస ట్వీట్లు(చైనా అధ్యక్షుడిని పొగిడిన ట్వీట్లు) కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సజావుగా సాగుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 
   ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్), ఒపెక్ ప్లస్‌ నేతృత్వంలోని దేశాలు సరఫరా కోతలను అమలు చేయడంతో, ఈ ఏడాది బ్రెంట్ క్రూడ్‌ ధర దాదాపు 10 శాతం పెరిగింది. దీనితోపాటు  జూలైలో ఈ దేశాలు చమురు ఉత్పత్తి కోతలను మార్చి 2020 వరకు పొడిగించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఏడాది మార్కెట్‌ను సమతుల్యంగా ఉంచడానికి సౌదీ అరేబియా ఏమైనా చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉందని సౌదీ అరేబియా అధికారి ఒకరు తెలిపారు. యుఎస్-చైనా వాణిజ్య వివాదం, బ్రెక్సిట్‌పై అనిశ్చితి, పెరుగుతున్న ముడిచమురు నిల్వలు, యుఎస్ షేల్ ఆయిల్ అధిక ఉత్పత్తితో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన భయాల వలన చమురు డిమాండ్‌ తగ్గుతోంది.

 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 16th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  భాష్‌ లిమిటెడ్‌:- రెండో త్రైమాసిక కాలం నుంచి  ప్రతి నెలలో 10రోజుల పాటు వివిధ ప్లాంట్లలో ‘‘నో ప్రాడెక్ట్స్‌ డే’’ పాటించనుంది. ఈ పదిరోజుల్లో ‘‘పవర్‌ట్రైన్‌ సెల్యూషన్స్‌ డివైజెస్‘‘ అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించనున్నట్లు కంపెనీ తెలిపింది.  యస్‌ బ్యాంక్‌:- క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.1,930 కోట్ల సమీకరణను పూర్తి చేసింది. ఆగస్ట్‌ 9న ప్రారంభమైన ఈ ఇష్యూకు 14వ తేదిన ముగిసినట్లు

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Friday 16th August 2019

 స్వాతంత్రదినం సెలవు తర్వాత శుక్రవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో పునర్‌ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా క్షీణతతో 37,100 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్లకుపైగా తగ్గుదలతో 10,960 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. బుధవారం రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు భారీగా పతనమైన ప్రభావం ఈ ఉదయం ఇక్కడి ట్రేడింగ్‌పై పడింది. యస్‌బ్యాంక్‌, యూపీఎల్‌, సిప్లా, కోల్‌ ఇండియాలు స్వల్పలాభాలతో మొదలుకాగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో

Most from this category