News


తెరపైకి ట్రేడ్‌వార్‌..తగ్గిన చమురు

Wednesday 25th September 2019
Markets_main1569390036.png-28536

యునైటెడ్‌ నేషనల్‌ జనరల్‌ అసెంబ్లీలో చైనా వాణిజ్య విధానాలను, యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించడంతో యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ తిరిగి పుంజుకున్నట్టయ్యింది. ఫలితంగా వరుసగా రెండవ రోజు కూడా చమురు ధరలు తగ్గాయి. ఉదయం 10.50 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.87 శాతం నష్టపోయి బారెల్‌ 61.58 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.68 శాతం తగ్గి బారెల్‌ 56.90 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.    
  ‘డొనాల్డ్‌ ట్రంప్‌ కామెంట్స్‌ చమురు ధరల పతనానికి కారణమవతున్నాయి. ఆయనిప్పటికి చైనాతో పోరాట దృక్పథంతోనే ఉన్నారు’ అని ఓండా ఆసియా పసిఫిక్ సీనియర్ మార్కెట్ విశ్లేషకులు, జెఫ్రీ హాలీ అన్నారు.

 ట్రంప్‌, చైనా ట్రేడ్‌ విధానాలను మంగళవారం యుఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో విమర్శించారు. యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలలో ‘చెత్త ఒప్పందాని’కి తాను ఒప్పుకోనని అన్నారు. కాగా చైనా అతిపెద్ద చమురు దిగుమతిదారి దేశాలలో ఒకటి. అంతేకాకుండా యుఎస్‌, చమురు వినియోగంలో మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండవ స్థానంలో ఉండడం గమనార్హం. ఫలితంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వలన చమురు డిమాండ్‌ ఆందోళనలు చమురు మార్కెట్‌లో పెరుగుతున్నాయి. 
  సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరగిన తర్వాత చమురు ధరలు అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. సౌదీ ఆరాంకో తన సరఫరా లక్ష్యాలను చేరుకోడానికి ఇతర మధ్య ప్రాచ్య చమురు ఉత్పత్తి దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం.  ‘చమురు మార్కెట్‌లో రిస్క్‌ ప్రీమియం కూడా పూర్తి తొలగిపోయింది’ అని హాలీ అన్నారు. ప్రస్తుతం చమురును ట్రేడ్‌ అనిశ్చితి నడిపిస్తోందని ఆయన తెలిపారు. వీటితో పాటు యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే పెరగడం కూడా చమురు ధరల పతనానికి కారణమవుతోంది. గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు 200,000 బారెల్స్‌ తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేయగా, అది 14 లక్షల బారెల్స్‌ పెరిగాయని మంగళవారం అమెరికన్‌ పెట్రోలియం ఇన్ట్సిట్యూట్‌ నివేదిక పేర్కొంది. కాగా ప్రభుత్వ అధికారిక డేటాను  యుఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేసన్‌ బుధవరాం విడుదల చేయనుంది.You may be interested

వైద్య బీమా ప్రీమియం వాయిదాల రూపంలో

Wednesday 25th September 2019

న్యూఢిల్లీ: వైద్య బీమా పాలసీ ప్రీమియంను నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలల వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం త్వరలో రానుంది. ప్రస్తుతం వార్షికంగా ఒకే సారి ప్రీమియం చెల్లించే సదుపాయే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సర ఆప్షన్లను ప్రవేశపెట్టినా కానీ, ప్రీమియం మొత్తంలో మార్పులు లేకుండా చూడాలని బీమా సంస్థలను ఆర్‌బీఐ తాజాగా కోరింది. 

ఫోర్బ్స్‌ జాబితాలో 17 ఉత్తమ భారత కంపెనీలు

Wednesday 25th September 2019

3వ స్థానంలో ఇన్ఫోసిస్‌ న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాలో 17 భారత కంపెనీలు స్థానం సంపాదించాయి. ‘వరల్డ్‌ బెస్ట్‌ రిగార్డెడ్‌ కంపెనీస్‌’ పేరిట విడుదల చేసిన తాజా జాబితాలో దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఏకంగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోల్చితే 31 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇతర భారత కంపెనీల్లో టాటా స్టీల్ (105వ స్థానం), ఎల్‌

Most from this category