News


పడిన చమురు ధర

Friday 5th July 2019
Markets_main1562300280.png-26809

అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడంతో చమురు డిమాండ్‌ భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. ఫలితంగా శుక్రవారం(జులై 5) ట్రేడింగ్‌లో చమురు ధరలు పడిపోయాయి. బెంచ్‌మార్కు బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.1శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.23 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.1 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 56.71డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
అంతేకాకుండా ఇరాన్‌ ఈయూ ఆంక్షాలను బేఖాతరు చేస్తు సిరియాకు ఆయిల్‌ సరాఫరా చేయడంతో బ్రిటీష్‌ ఆయిల్‌ మెరైన్‌ ఇరాన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను గురువారం సీజ్‌ చేయడంతో మధ్యప్రాచ్య దేశాలలో ఉద్రిక్త వాతవరణం నెలకొవడంతో పాటు పాటు అధికంగా చమురును వినియోగించే అమెరికాలో తయారిరంగ వృద్ధి మందగించడంతో చమురు వినియోగం తగ్గింది. అమెరికా నిల్వలు 30 లక్షల బ్యారెల్‌ల ఉత్పత్తి పడిపోతుందని అంచనా వేయగా అది 11లక్షల బ్యారల్‌ మాత్రమే ఉందని ఎనర్జీ ఇన్ఫ్‌ర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపిన విషయం తెలిసిందే.  అమెరికా చమురు నిల్వలు విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా పడిపోవడంతో అధిక సరఫరా కారణాన చమురు ధరలు నష్టపోయి ట్రేడవుతున్నాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 5th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  యస్‌ బ్యాంక్‌:- ఎవర్‌గ్రీన్‌ తనఖా పెట్టిన 9.47శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకుంది.  డీఎల్‌ఎఫ్‌:- గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత కలిగిన షేర్‌ హోల్డర్లకు డివిడెండ్‌ జారీకి రికార్డు తేదికి జూలై 23గా నిర్ణయించింది. మారుతి సుజుకీ:- డీలర్లతో కలిసి కార్ల ధరలను మాన్యుపులేట్‌ ఆరోపణలపై కాంపిటీషన్‌ కమీషన్‌ ఆప్‌ ఇండియా సమగ్ర విచారణకు ఆదేశించింది. జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- జీఎంఆర్‌ చత్తీస్‌ఘడ్‌

బడ్జెట్‌ రోజున లాభాల ప్రారంభం

Friday 5th July 2019

ఈ రోజు కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు వెలువడనున్న నేపథ్యంలో శుక్రవారం భారత్‌ సూచీలు మరో శుభారంభాన్ని చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 39,990 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,962 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

Most from this category