News


భగ్గుమన్న చమురు..రూ. 4200 పైకి ఎంసీఎక్స్‌ క్రూడ్‌

Monday 16th September 2019
Markets_main1568607329.png-28394

గత వారంతంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి క్షేత్రాలపై డ్రోన్‌ దాడి జరగడంతో సోమవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. షార్ట్‌ కవరింగ్‌, మార్జిన్‌ కాల్స్‌ పెరగడంతో సోమవారం మార్కెట్‌ ప్రారంభంలో దేశీయ ఎంసీఎక్స్‌(మల్టీ కమొడిటీ ఎక్సేంజ్‌)లో చమురు రూ. 4200 స్థాయిని అధిగమించింది. బ్రెంట్‌ క్రూడ్‌ ప్రపంచ మార్కెట్లో సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 20 శాతం పైగా లాభపడింది. తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఉదయం 9.25 సమయానికి 9.91 శాతం లాభపడి బారెల్‌ 66.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా డబ్ల్యూటీఐ క్రూడ్‌ కూడా 8.90 శాతం లాభపడి బారెల్‌ 59.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ల ఫలితంగా ఎంసీఎక్స్‌ క్రూడ్‌ ఉదయం 9.25 సమయానికి 8.84 శాతం లాభపడి రూ. 4261 వద్ద ట్రేడవుతోంది.
   కాగా అంతర్జాతీయ మందగమన భయాల వలన డిమాండ్‌ ఆందోళనలు చమురు ధరలను వెంటాడుతున్నాయని, ఫలితంగా ఎక్కువ కాలం చమురు గరిష్ఠ స్థాయిల వద్ద నిలకడగా రాణించే అవకాశం తక్కువని విశ్లేషకులు తెలిపారు. ‘సౌదీ రిఫైనరీలపై డ్రోన్‌ దాడి వలన మార్జిన్‌ కాల్స్‌ పెరిగాయి ఫలితంగా చమురు గరిష్ఠాలను తాకింది. కానీ చమురు మార్కెట్‌లో అంతర్లీనంగా కొనసాగుతున్న కారకాల వలన ఈ అధిక ధరలు స్థిరంగా ఉంటాయని అనుకోవడం లేదు’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ అండ్ కరెన్సీ హెడ్, కిషోర్ నార్నే అన్నారు.You may be interested

ఈ ఆర్థిక అలవాట్లకు దూరం...

Monday 16th September 2019

ఈ ఆర్థిక అలవాట్లకు దూరం... (ప్రాఫిట్‌) ఆర్థిక ప్రయోజనాలకు కొన్ని అలవాట్లతో విఘాతం సరైన అధ్యయనంతోనే షేర్లలో పెట్టుబడులు వైవిధ్యం పేరుతో భారీ సంఖ్యలో షేర్లతో నష్టమే అత్యవసర నిధిని విస్మరించడం తగదు పన్ను ఆదా కోసం కాదు బీమా జీవిత రక్షణే ప్రధమ ప్రాధాన్యం కావాలి జీవన ప్రయాణంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనుకుంటే అందుకు పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపించేవి అయి ఉంటాయి.

నికో వాటా రిలయన్స్‌, బీపీల చేతికి

Monday 16th September 2019

10 శాతం నికో వాటా.. రిలయన్స్‌, బీపీల పరం  ప్రభుత్వం ఆమోదం !  న్యూఢిల్లీ: కేజీ-డి6 చమురు క్షేత్రంలో కెనడాకు చెందిన నికో రిసోర్సెస్‌కు ఉన్న 10 శాతం వాటాను ఇతర భాగస్వాములు టేకోవర్‌ చేశారని సమాచారం. ఈ చమురు క్షేత్రానికి సంబంధించి అభివృద్ధి వ్యయాల్లో తన వాటాను చెల్లించడంలో నికో రిసోర్సెస్‌ విఫలమైంది. దీంతో ఇతర భాగస్వాములు-రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇంగ్లాండ్‌కు చెందిన బీపీ పీఎల్‌సీలు నికో రిసోర్సెస్‌ వాటాను టేకోవర్‌ చేశాయని

Most from this category