News


కనిష్టస్థాయి నుంచి కోలుకున్న చమురు

Wednesday 23rd October 2019
Markets_main1571807791.png-29076

యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పెరగడంతో బుధవారం సెషన్‌లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కానీ ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు అధిక మొత్తంలో ఉత్పత్తి కోతను అమలు చేస్తారనే అంచనాలుండడంతో చమురు ధరల పతనం తగ్గింది. ఉదయం 10.23 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.47 శాతం నష్టపోయి బారెల్‌ 59.42 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.77 శాతం నష్టపోయి బారెల్‌ 54.06 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అక్టోబర్‌ 18తో ముగిసిన వారానికి గాను యుఎస్‌ చమురు నిల్వలు 4.5 మిలియన్‌ బారెల్స్‌ పెరిగి 437 మిలియన్‌ బారెల్‌కు చేరుకుందని అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టీట్యూట్‌ డేటా పేర్కొంది. కాగా ఈ పెరుగుదల 2.2 మిలియన్‌ బారెల్స్‌గా ఉంటుందని విశ్లేషకు అంచనావేయడం గమనార్హం. యుఎస్‌ చమురు నిల్వలపై ప్రభుత్వ అధికారిక డేటాను యుఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ బుధవారం ప్రకటించనుంది. 
  ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు), ఒపెక్‌ ప్లస్‌ దేశాలు మరింతగా ఉత్పత్తి కోతను అమలు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాయనే వార్తలు వెలువడడంతో గత సెషన్‌లో చమురు ధరలు కనిష్ఠాల నుంచి 1 శాతం మేర లాభపడ్డాయి. ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు 2020 మార్చి వరకు రోజుకు 12 లక్షల బారెల్‌ను ఉత్పత్తి కోతను అమలుచేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ దేశాలు డిసెంబర్‌ 5-6 తేదిలలో తిరిగి సమావేశం కావాలని నిర్ణయించుకున్నాయి. దీనికితోడు యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం వచ్చే నెలలో ఖరారు కానుందనే అంచనాలు వెలువడడంతో కూడా చమురు ధరలు పెరిగాయి. 



You may be interested

ఇన్ఫీ టార్గెట్‌ తగ్గింపు... ఇప్పటికైతే లేదు!

Wednesday 23rd October 2019

బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు విజిల్‌బ్లోయర్‌ దెబ్బతో ఇన్ఫోసిస్‌ షేరు భారీ నష్టాలు చవిచూసిన సంగతి తెలిసిందే. కంపెనీ టాప్‌మేనేజ్‌మెంట్‌పై వచ్చిన ఫిర్యాదుల పర్యవసానం ఎలా ఉంటుందోనని మదుపరులు ఆందోళన పడుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే షేరు డీరేటింగ్‌తో ఉండొచ్చని, విచారణ పూర్తయ్యేవరకు షేరుపై సందిగ్ధత కొనసాగుతుందని బ్రోకరేజ్‌లు చెబుతున్నాయి. టాప్‌మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి మార్పులు సంభవించినా, లేదా విక్రయ వ్యూహాలు మార్చుకున్నా కంపెనీ వృద్దిపై నెగిటివ్‌ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. అయితే కేవలం ఆరోపణల

‘‘యూఎస్‌ సెక్‌’’ చేతిలో ఇన్ఫీ సాక్ష్యాలు!

Wednesday 23rd October 2019

కంపెనీ విచారణ వల్ల ప్రయోజనం లేదంటున్న నిపుణులు అమెరికా నియంత్రణ సంస్థ నిర్ణయమే కీలకం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో టాప్‌ మేనేజ్‌మెంట్‌ అనైతికంగా వ్యవహరిస్తోందంటూ విజిల్‌బ్లోయర్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారణకు అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ లాసంస్థను నియమిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. కానీ ఈ విషయమై పూర్తి సాక్ష్యాలు యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ కమీషన్‌(యూఎస్‌ సెక్‌) చేతిలో ఉన్నందున కంపెనీ విచారణ ఎంతవరకు సాగుతుందోనని నిపుణులు అనుమానం వ్యక్తం

Most from this category