News


నష్టాల్లో చమరు

Monday 7th October 2019
Markets_main1570422323.png-28750

అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనలు వెంటాడుతుండడంతో చమురు ధరలు సోమవారం కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఉదయం 9.36 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.43 శాతం నష్టపోయి బారెల్‌ 58.12 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.27 శాతం నష్టపోయి 52.67 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ వారం చివరిలో వాషింగ్టన్‌లో యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్ఠి మరలింది. కాగా యుఎస్‌, చైనా తయారిరంగం పనితీరు ట్రేడ్‌వార్‌ వలన బలహీనపడడంతో, గత వారంలో ఈ రెండు కాంట్రాక్టులు 5 శాతం మేర పతనమయ్యాయి. రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను మాంధ్యంలోకి నెడుతుందని అంచనాలు పెరిగాయి. ఇది చమురు డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
  అక్టోబర్‌ 10-11 న యుఎస్‌-చైనా ప్రతినిధులు వాషింగ్టన్‌లో సమావేశం కానున్నారు. వాణిజ్య ఒప్పం‍దానికి సంబంధించి నిర్ణయాలుంటాయని ఇన్వెస్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యప్రాచ్య ఉద్రిక్తలు పెరిగినప్పటికి, సౌదీ పూర్తి స్థాయిలో తన చమురు ఉత్పత్తిని పునరుద్ధరించడంతో అధిక సరఫరా ఆందోళనలు చమురు ధరలను కిందకి లాగుతున్నాయి.  
  ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు)లో రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశమయిన ఇరాక్‌లో ప్రభుత్వ ‍వ్యతిరేక ఆందోళనలు పెరగడంతో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.



You may be interested

పెరిగిన పసిడి..!

Monday 7th October 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 5 డాలర్లు పెరిగింది. ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత ఇందుకు కారణమయ్యాయి.  అమెరికా-చైనాల మధ్య ఈ గురు, శుక్ర (10, 11తేదీల్లో) వారాల్లో ఉన్నతస్థాయి చర్చలు జరగనున్నాయి. ఏడాదిన్నర కాలంగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ కుంటుపడటంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా కదులుతోంది. అయితే, అమెరికా ప్రతిపాదినలకు చైనా

బ్యాంకులపై ఆంక్షలు... డిపాజిట్లు భద్రమేనా..?

Monday 7th October 2019

ఇటీవలే పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు ఒక ఖాతా నుంచి పరిమితంగా నగదు ఉపసంహరణ ఆరు నెలల పాటు ఇదే పరిస్థితి ఈ తరహా సందర్భాలపై అవగాహన తక్కువే బ్యాంకు దివాలా తీస్తేనే డిపాజిట్‌పై బీమా ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా రూ.లక్ష తగిన జాగ్రత్తలతోనే ఖాతాదారులకు రక్షణ  బ్యాంకుల్లో మన నగదు భద్రంగా ఉంటుందన్న భరోసాయే... వడ్డీ రాబడి తక్కువైనా కానీ ఇప్పటికీ చాలా మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయడానికి కారణం. కావాలనుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా డిపాజిట్‌ను వెనక్కి

Most from this category