News


ముడి చమురు 4 శాతం క్రాష్‌!

Saturday 30th November 2019
Markets_main1575100682.png-29980

అమెరికా-చైనా మధ్య రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతోపాటు, అమెరికా చమురు ఉత్పత్తి గరిష్ఠంగా పెరగడంతో గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. యుఎస్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ 4 శాతం మేర పతనమయ్యింది. అయినప్పటికి వచ్చే నెల జరగనున్న ఒపెక్‌ సమావేశంలో చమురు ఉత్పత్తి కోతను పొడిగించే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో చమురు ధరల నెల సగటు గరిష్టం కంటే పైనే ముగిశాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1.44 డాలర్లు పడిపోయి 62.43 డాలర్లకు చేరుకొంది. మొత్తంగా బ్రెంట్‌ క్రూడ్‌  ఈ వారంలో 1.5 శాతం పతనమయ్యింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత నుంచి గమనిస్తే, నవంబర్‌ కాంట్రక్ట్‌ 6 శాతం పెరగడం గమనార్హం. డబ్ల్యూటీఐ క్రూడ్‌ 2.94 డాలర్ల పడిపోయి 55.17 డాలర్లకు చేరుకోగా, ఈ వారంలో ఇది 4.1 శాతం నష్టపోయింది. నెలవారిగా గమనిస్తే డబ్ల్యూటీఐ క్రూడ్‌ 2.3 శాతం పెరిగింది. ఇది ఈ ఏడాది జూన్‌ నుంచి అత్యధికం కావడం గమనార్హం. గురువారం యుఎస్‌​ థ్యాంక్స్‌ గివింగ్‌ సెలవు కావడం, శుక్రవారం ‘బ్లాక్‌ ఫ్రైడే’ షాపింగ్‌ రోజు కావడంతో ఎక్స్‌ఛేంజ్‌లు సగం రోజే పనిచేయడంతో  ట్రేడింగ్‌ వాల్యుమ్‌లు తక్కువగా ఉన్నాయి. 
 ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు డిసెంబర్‌లో జరగనున్న సమావేశంలో చమురు ఉత్పత్తి కోతను 2020 మధ్య వరకు పొడిగించే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా చమురు ధరలకు మద్ధతు లభిస్తోంది. ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు రోజుకు 12 లక్షల బ్యారెల్స్ చమురు కోతను వచ్చే మార్చి వరకు విధించాలని ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. 



You may be interested

11,800 స్థాయిని కోల్పోతేనే, మార్కెట్‌ బేర్స్‌ చేతుల్లోకి!

Saturday 30th November 2019

మార్కెట్‌ ధోరణిని చూస్తే, నిఫ్టీ 11,800 స్థాయిని(వారపు ఆధారంగా) కోల్పోతేనే తప్ప ప్రస్తుత అప్‌మూవ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని ట్రేడ్‌బుల్స్‌ సెక్యురిటీస్‌, సీఎండీ దినేష్‌ థక్కర్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో..   నిఫ్టీ వరుసగా మూడవ నెలలో కూడా నిలకడగా పెరుగుతూ కదిలింది. ఈ నెలలో నిఫ్టీ సుమారుగా 1.5 శాతం వృద్ధి చెందింది. రంగాల వారిగా చూస్తే, బ్యాంక్‌ నిఫ్టీ, ఫైనాన్సియల్స్‌

43 పాయింట్లు నష్టపోయిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 30th November 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం నష్టంతో ముగిసింది. శుక్రవారం నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ ముగింపు 12099.85తో పోలిస్తే 43 పాయింట్ల నష్టంతో 12,056.00 వద్ద స్థిరపడింది.  వాణిజ్య చర్చల ఒప్పందంపై అనుమానాలు రెకెత్తడంతోపాటు జీడీపీ డేటాపై అంచనాలతో క్రితం రోజు నిఫ్టీ ట్రేడింగ్‌ ప్రారంభం నుండి దిద్దుబాటుకు లోనుకావడంతో12,050 స్థాయి వద్ద ముగిసింది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ...ఇక్కడి నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌తో అనుసంధానమై ట్రేడవుతుంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం రాత్రి క్షీణించడం, మన మార్కెట్‌ ముగిసిన తర్వాత

Most from this category