News


తగ్గిన చమురు

Tuesday 22nd October 2019
Markets_main1571725565.png-29050

యుఎస్‌-చైనా మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కారించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండడంతో మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు స్థిరంగా కదులుతున్నాయి. కానీ అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్‌ తగ్గడంతో చమురు మార్కెట్లు ప్రతికూల దృక్పథంతోనే ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. ఉదయం 11.22 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.25 శాతం నష్టపోయి బారెల్‌ 58.81 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 0.34 శాతం నష్టపోయి బారెల్‌ 53.33 డాలర్‌ వద్ద ట్రేడవుతున్నాయి.   
   యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య వివాదాలకు ముగింపు పలకడానికి ఇరు దేశాల మధ్య చర్చలు బాగా జరుగుతున్నాయని సోమవారం యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.  అంతేకాకుండా యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఫేజ్‌ 1 పై సంతకాలు చేయడానికి ఇరు దేశాల నాయకులు వచ్చే నెలలో ఏపెక్‌(ఏపీఈసీ) సమ్మిట్‌లో సమావేశం కానున్నారని తెలిపారు. ‘యుఎస్‌, చైనా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధమవుతుండడంతో కమోడిటీ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి’ అని ఏఎన్‌జెడ్‌ బ్యాంక్‌ ఓ నివేదికలో తెలిపింది. ‘అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థికమందగమనం వలన చమురు మార్కెట్లు మాత్రం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని ఈ బ్యాంక్‌ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చేరుకున్న గరిష్ఠాల నుంచి బ్రెంట్‌ క్రూడ్‌ 22 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 20 శాతం మేర పతనమవ్వడం గమనార్హం. 
   యుఎస్‌-చైనా వాణిజ్య యుధ్ధం కొంత సరళతరం అయినప్పటికి, ప్రస్తుత పాక్షిక ఒప్పందాన్ని  వచ్చే నెలలో ఇరు దేశాల నాయకులు ఖరారు చేయవలసిన అవసరం లేదని యుఎస్‌ వాణిజ్య సెక్రటరీ విల్‌బర్‌ రోజ సోమవారం అన్నారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య సరియైన ఒప్పందం అవసరమని తెలిపారు. ఇది ఇరు దేశాల మధ్య  మరింతాగా చర్చలు జరగవలసిన అవసరాన్ని తెలుపుతోంది. ఈ ఒత్తిళ్లకుతోడు బరాక్ ఒబామా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో డబ్యూటీఐ నిబంధనలకు కట్టుబడకుండా చైనా దిగుమతులపై సుంకాలను విధించిన కేసులో, చైనా 2.4 బిలియన్‌ డాలర్ల ప్రతీకార ఆంక్షలను విధించాలను చూస్తోందని సోమవారం ఓ డాక్యుమెంట్‌ పేర్కొంది. దీంతోపాటు యుఎస్‌ చమురు నిల్వలు వరసగా ఆరవ వారంలో కూడా పెరుగుతాయని విశ్లేషకులు అంచనావేయడంతో చమురు ధరలు నష్ఠాల్లో ట్రేడవుతున్నాయి.



You may be interested

రికార్డు స్థాయికి ఐసీఐసీఐ బ్యాంక్‌

Tuesday 22nd October 2019

ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు విలువ మంగళవారం సెషన్‌లో మరోదఫా రికార్డుస్థాయిని చేరింది. గత నెలలో కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు సమయంలో నెలకొల్పిన రూ. 458.65 స్థాయిని తిరిగి ఈ రోజు ఐసీఐసీఐ బ్యాంక్‌ టచ్‌చేయడం విశేషం.  మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు విలువ 4.5 శాతం లాభపడి రూ. 458.70 స్థాయికి చేరింది. గత సెషన్లో రూ. 437.80 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్లో రూ.

స్థిరంగా పసిడి

Tuesday 22nd October 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల సఫలంపై ఆశావహ అంచనాలతో పసిడి ధర మంగళవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర అరశాతం లాభంతో 1,489 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే చర్చలపై సరైన వివరణ లేకపోవడంతో పసిడికి మద్దతు లభిస్తోంది. యూ.ఎస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ఆశావహనంగా మాట్లాడిన అనంతరం చైనా ఉప విదేశాంగ మంత్రి లే యుచెంగ్ స్పందించారు.

Most from this category