News


పెరిగిన చమురు ధరలు

Wednesday 4th September 2019
Markets_main1567571361.png-28173

  గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు తగ్గుతాయనే అంచనాల నేపథ్యంలో బుధవారం​ చమురు ధరలు పెరిగాయి. ఉదయం 9.39 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.15 శాతం పెరిగి బారెల్‌ 58.35 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.32 శాతం పెరిగి బారెల్‌ 54.11 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అగష్టు 30తో ముగిసిన వారానికి గాను క్రూడ్‌ యుఎస్‌ నిల్వలు 30 లక్షల బారెల్‌లు, యుఎస్‌ గ్యాసోలిన్‌ నిల్వలు 19 లక్షలు బారెల్లు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా అధికారికంగా ఈ డేటాను అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌ బుధవారం ప్రకటించనుండగా, యుఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ గురువారం ప్రకటించనుంది.   
  అంతేకాకుండా డోరిన్‌ హరికేన్‌ ప్రభావం వలన ఫోరిడాలో చమురు ఉత్పత్తిని గురించి ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నారని విశ్లేషకులు తెలిపారు. ‘హరికేన్‌ డోరిన్‌ను కేటగిరి 2 కు డౌన్‌గ్రేడ్‌ చేసినప్పటికి ఇది ఫ్లోరిడా తీరం వైపు కదులుతోంది. గ్యాసోలిన్‌, డీజిల్‌ డిమాండ్‌పై దీని ప్రభావం ఉంటుంది’ అని ఏఎన్‌జెడ్‌ ఓ నోట్‌లో తెలిపింది. విటితో పాటు యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఘర్షణలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం చమురు డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుఎస్‌ పర్చేజింగ్‌ మానెజర్స్‌ ఇండెక్స్‌ అగష్టులో మూడేళ్ల కనిష్ఠానికి(49.1కి) పడిపోయిందని ఇనిస్టీట్యూట్‌ ఆఫ్‌ సప్లే మేనేజ్‌మెంట్‌(ఐఎస్‌డబ్యూ) ఓ నివేదికలో పేర్కొంది. ఈ అంశం కూడా చమురు డిమాండ్‌పై ప్రభావం చూపనుంది.



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 4th September 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  టాటా కమ్యూనికేషన్స్‌:- ఐఓటీ సర్వీస్‌ల కొరకు నీకో గ్లోబల్‌ ఐసీటీ సర్వీస్‌ సంస్థ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  గుజరాత్‌ అపోలో ఇండస్ట్రీస్‌:- తన అనుబంధ సంస్థ ఏఈఎంల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో తన మొత్తం వాటాను విక్రయించింది.  సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- వాహన, గృహ రుణాలకు రెపో లింక్డ్ వడ్డీ రేటును ప్రవేశపెట్టింది  ఫ్యూచర్‌ మార్కెట్‌ నెట్‌వర్క్స్‌:- నాగపూర్‌, జార్ఖండ్‌లో లాజిస్టిక్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Wednesday 4th September 2019

క్రితం రోజు భారీ పతనం అనంతరం మార్కెట్‌ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గత ముగింపు (36,563)తో పోలిస్తే 8 పాయింట్ల స్వల్పలాభంతో 36,575.24 వద్ద, నిఫ్టీ నిన్నటి ముగింపు (10,798)తో పోలిస్తే 8 పాయింట్ల నష్టంతో 10,790.40 వద్ద ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు సూచీలను నష్టాల వైపు మళ్లించాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడలు కొనసాగుతుండటం, బలహీనమైన ఆర్థిక గణాంకాల నమోదు,

Most from this category